KTR | అంకిరెడ్డిపల్లెలో బీరప్ప వేడుకలకు హాజరైన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు గురువారం సిరిసిల్లలో పర్యటించారు. తంగ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీరప్ప- కామరతి కళ్యాణ మహోత్సవ వేడుకలకు హాజరయ్యారు.
- పెద్దూరులో నూతన దంపతులకు ఆశీర్వాదం
KTR | సిరిసిల్ల టౌన్, మే 15: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు గురువారం సిరిసిల్లలో పర్యటించారు. తంగ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీరప్ప- కామరతి కళ్యాణ మహోత్సవ వేడుకలకు హాజరయ్యారు. కుర్మ సంఘం ఆధ్వర్యంలో నాయకులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో కేటీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుండి సిరిసిల్ల క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో బీఆర్ఎస్ నాయకుడు ముష్కం దేవగౌడ్ కూతురు వివాహం ఇటీవల జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఆ తరువాత ఎల్లారెడ్డిపేట పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇక్కడ నాఫ్ స్కాట్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, బొల్లి రామ్మోహన్, సింగిరెడ్డి రవీందర్రెడ్డి పడిగెల రాజు, మాట్ల మధు, కేటీఆర్ సేన మండలాధ్యక్షుడు భాస్కర్ గౌడ్, కల్లూరి రాజు, అన్నారం శ్రీనివాస్, బండారి శ్యాం, కుంబాల మల్లారెడ్డి, సత్తార్, తదితర నాయకులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

