చక్కెర ఫ్యాక్టరీ కమిటీ గురించి చెప్పండి
తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీపై ప్రభుత్వం కమిటీ వేసినట్లు ఇటీవల ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నానని, దీని గురించి తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కోరారు.
- అసెంబ్లీలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
మెట్పల్లి, ఫిబ్రవరి 15 : తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీపై ప్రభుత్వం కమిటీ వేసినట్లు ఇటీవల ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నానని, దీని గురించి తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో గురువారం జీరో అవర్లో కోరుట్ల నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ముందుగా శాసనసభ్యుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా సభలో మాట్లాడే అవకాశం వచ్చినందుకు శాసనసభాపతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. చక్కెర ఫ్యాక్టరీపై వేసిన కమిటీ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, చెరుకు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధిత అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బాధ్యత తనకు ఉంటుందన్నారు.
ఏ కమిటీ వేశారు, ఆ కమిటీ తీసుకునే చర్యలు, విధి విధానాలు ఏంటో తమకు చెప్పాలని కోరారు. కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల అభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ నుంచి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను నిలిపేయాలని నిర్ణయించిందని, అభివృద్ధి పనులు కొనసాగేందుకు నిధులను విడుదల చేయాలని కోరారు. కోరుట్ల డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ బాధితుల సంఖ్యకు అనుగుణంగా సంబంధిత మిషన్లు సరిపోవడం లేదని, వెంటనే డయాలసిస్ మిషన్ల సంఖ్యను పెంచినైట్లెతే పేద కిడ్నీ బాధితులకు మేలు జరుగుతుందని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

