Kolanur | ఓదెల, మార్చి 2 : న్యూఢిల్లీలో ఈనెల 7న నిర్వహించే లైన్మెన్ దివాస్-2026 వేడుకలకు తెలంగాణ ఎన్పీడీసీఎల్ లో పనిచేస్తున్న లైన్మెన్ నరాల మునీశ్వరరావు ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) టాటా పవర్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని స్టేయిల్ ఆడిటోరియంలో మార్చి 7న ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
ఇందులో పాల్గొనేందుకు ఎన్పీడీసీఎల్ పంపిణీ సంస్థ తరఫున కొలనూరు లైన్మెన్ మునీశ్వర్ రావుని ఎంపిక చేసినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రకటించినట్లు తెలిపారు. కొలనూర్ కు చెందిన లైన్మెన్ జాతీయ స్థాయి వేడుకలకు ఎంపిక కావడం పట్ల సర్పంచ్ పల్లె కనకయ్య, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, ట్రాన్స్కో ఏఈ మోహన్ నాయక్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.