జగిత్యాల, మే 13: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా ప్రముఖ విద్యాసంస్థలైన జగిత్యాలలోని కేజీఆర్, జాబితాపూర్‌లోని శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అనుమల్ల పృద్వీక 481, అక్కినపెల్లి ఆకాశ్ 467, క్యాతం గౌతంరెడ్డి 461, ఆడిదెల శివాణి 458, జువ్వాజీ దివ్యశ్రీ 451, సైనవేని హారిక 446, ఎముల గాయత్రి 444, నక్క అభిషేక్ 440, ఎలిగేటి శ్రీనిధి 440, నవ్య భానుశ్రీ 439, చేత్పెల్లి తరిణి 439 మార్కులు సాధించారు.
ఈ ఏడాది జాబితాపూర్ బ్రాంచ్‌లో ఉన్న మొత్తం 144మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోనే ఈ విజయం సాధ్యమైందని కరస్పాండెంట్ గంగారెడ్డి, డైరెక్టర్ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. విజయోత్సవ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీ పూర్ణచందర్, ఏ సనత్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.