శంకరపట్నం, నవంబర్ 28 : వీధి రౌడీలుగా చలామ ణి అవుతూ గ్రూపులుగా ఏర్పడి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై రౌడీ షీట్లు తెరవాలని సీపీ అభిషేక్ మ హంతి ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువా రం సీపీ కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సి బ్బందితో మాట్లాడారు. పలు సందర్భాల్లో పట్టుబడి పోలీ స్స్టేషన్లో ఉన్న వాహనాలపై వాకబు చేసి, వాటిని తొల గించాలని ఆదేశించారు. అలాగే పోలీస్‌స్టేషన్‌లో పెం డింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించారు. పాత నేరస్తులపై తరచుగా నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు.
రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలపై నిఘా ఉంచాలన్నా రు. ప్రజల్లో సైబర్‌నేరాలపై అవగాహన కలించాలన్నారు. ప్రధాన రహదారిపై బ్లాక్ స్పా ట్ను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం అక్ర మ రవాణా, ఏకాట ఆడే వారిపై ఉక్కు పాదం మోపా లన్నారు. హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్ఐ రవి, ఏఎస్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.