KDCC BANK | చిగురుమామిడి, ఏప్రిల్ 3: చిగురుమామిడి మండల కేంద్రంలోని కేడీసీసీబీ బ్రాంచ్ మార్చి 31 నాటికి 7,787 ఖాతాదారులతో రూ.84.32 కోట్లు ఆర్థిక సంవత్సరం బ్యాంక్ టర్నోవర్ సాధించినట్లు బ్యాంకు మేనేజర్ గూడూరి అనిత తెలిపారు. గత సంవత్సరం రూ.27. 14 కోట్ల నుండి రూ.50.15 కోట్ల వరకు చేరిందన్నారు.
ముఖ్యంగా ఎన్ పి ఏ జీరో గా ఉందని బ్రాంచ్ టర్నోవర్ ఈ సంవత్సరం 84.32 కోట్లు చేరుకోవడం ఖాతాదారుల సహకారంతో సాధ్యమైందన్నారు. ఖాతాదారుల సహకారంతోనే బ్యాంకు లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు మేనేజర్ పేర్కొన్నారు. కేడీసీసీ బ్యాంకు సిబ్బంది గ్రామాల్లో ఇంటింటా తిరిగి బ్యాంకు సేవలను తెలియజేసినట్లు పేర్కొన్నారు.
ఖాతాదారులకు డిపాజిట్లపై అత్యధిక వడ్డీ అందజేయడం జరిగిందని, వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు, ఉన్నత చదువులకు, గృహ నిర్మాణాలకు, బంగారు అభరణాలకు రుణాల అందించినట్లు తెలిపారు. కేడీసీసీ బీ ద్వారా ఖాతాదారులకు ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంకింగ్ యాప్ వంటి నగదు రహిత లావాదేవీలను అందించినట్లు తెలిపారు. అలాగే బ్యాంకులో లాకర్ సదుపాయం ఏర్పాటు చేసి ఖాతాదారులకు సేవలు అందించినట్లు పేర్కొన్నారు.