చొప్పదండి, అక్టోబర్ 18: వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి దీవించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండ, రాగంపేట, పెద్దకుర్మపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, ఓటు అభ్యర్థించారు.
ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవన నిర్మాణాలు, ఆలయాలు, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.600 కోట్లు మంజూరు చేయగా, పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో చొప్పదండి అభివృద్ధికి రూ. 120 కోట్లు మంజూరు చేయించి, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించామని, 100 పడకల దవాఖాన మంజూరు చేయించినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్నారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదో ప్రశ్నించాలని ప్రజలను కోరారు. కాంగ్రెసోల్లు పాలించిన 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ కేవలం తొమ్మిదేళ్లలో చేసి చూపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. కారు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, సర్పంచులు విద్యాసాగర్‌రెడ్డి, మామిడి లత-రాజేశం, పెద్ది శంకర్, వెల్మ నాగిరెడ్డి, గుంట రవి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్వై నియోజకవర్గ ఇన్చార్జి బందారపు అజయ్‌కుమార్ గౌడ్, కోఆప్షన్ పాషా, నాయకులు ఏనుగు స్వామిరెడ్డి, రాపెల్లి ఐలయ్య, మహేశ్, జితేందర్‌రెడ్డి, మణిశంకర్రెడ్డి, నరేశ్ రావన్, యువరాజు, చిన్నారెడ్డి, సీపెల్లి గంగయ్య, కుందేళ్ల బాలకిషన్, పబ్బ శ్రీను, దీటి మధు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.