ఉద్యమనేత, అభివృద్ధి ప్రదాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్‌డే అంబరాన్నంటింది. సామాజిక సేవ వెల్లువెత్తింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు వృక్షార్చన విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరూరా విరివిగా మొక్కలు నాటారు. కేక్‌లు కోసి.. స్వీట్లు పంపిణీ చేసి.. ‘హ్యాప్పీ బర్త్‌డే కేసీఆర్ సర్’.. అంటూ నినదించారు. జననేత నూరేళ్లు వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు. ఇదే సమయంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేశారు.
కార్పొరేషన్, ఫిబ్రవరి 17: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా అంబురాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని స్థానిక మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం పేదలకు అల్పాహారం పంచిపెట్టా రు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. ఇక్కడ ఏఎంసీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ కార్పొరేటర్లు బండారి వేణు, కంసాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు ఆరె రవిగౌడ్, చుక శ్రీనివాస్, బొంకూరి మోహన్, వడ్లకొండ పర్శరాములు, సాయికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, కలర్ సతన్న, దూలం సంపత్, గుర్రం మహేందర్, అజయ్ తదితరులు ఉన్నా రు. అలాగే తెలంగాణచౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కట్ చేసి సం బురాలు జరుపుకొన్నారు. అనంతరం ప్రజలకు మొకలు పంపిణీ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షులు కాసారపు శ్రీనివాస్‌గౌడ్, శ్యామ్ సుందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మానకొండూర్, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కేక్‌ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కేక్ కట్ చేశారు. తర్వాత కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే మండల కేంద్రంలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమాలలో మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు నల్ల గోవిందరెడ్డి, రామంచ గోపాల్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, దండబోయిన శేఖర్, మర్రి కొండయ్య, బొంగోని రేణుక, కొండ్ర నిర్మల, ఇస్కుల్ల అంజయ్య, నామాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
గంగాధర, ఫిబ్రవరి 17: మధురానగర్‌లో ఏర్పాటు చేసిన కేక్‌ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కట్ చేశారు. గట్టుభూత్కూర్లో మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్‌రెడ్డి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. గర్శకుర్తి, ర్యాలపల్లిలో బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. ఇక్కడ నాయకులు వేముల దామోదర్, రామిడి సురేందర్, ఆకుల మధుసూదన్, సామంతుల శ్రీనివాస్,వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, తదితరులు ఉన్నారు.
హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 17: పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అలాగే, ప్రభుత్వ పాఠశాల మైదానంలో నాయకులు మొక్కలు నాటి కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ పార్టీ మండలాధ్యక్షుడు సంఘం అయిలయ్య, రాష్ట్ర నాయకుడు వీ రవీందర్రావు, నాయకులు రమాదేవి, లావణ్య, కుమార్‌యాదవ్, ప్రతాపకృష్ణ, ఉమామహేశ్వర్, శిరీష, పాల కిషన్, ముత్యం రాజు, ముక్క రమే శ్, ఇమ్రాన్, కొండ్రు నరేశ్, తాళ్లపెల్లి శ్రీనివాస్, కిరణ్‌గౌడ్, శ్రీనివాస్, తులసీ లక్ష్మణమూర్తి, సతీశ్‌గౌడ్, నాగరాజు, పంజాల శ్రీధర్, కమలాకర్‌గౌడ్, శివ, రాంరెడ్డి, రేణుక, రోషిందర్, మధు, రాజిరెడ్డి, రమేశ్, తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్, ఫిబ్రవరి 17: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో తెలంగాణ ముస్లిం మేధావుల ఫోరం జిల్లా కార్యదర్శి మహ్మద్‌సలీం ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఇక్కడ ముస్లిం మేధావుల ఫోరం ప్రతినిధులు మహ్మద్ ఇర్ఫాన్, నయీ మ్, అలీమొద్దీన్, తదితరులు ఉన్నారు.
వీణవంక, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ మాజీ సర్పంచులు పోతుల నర్సయ్య, పొదిల జ్యోతి-రమేశ్, మోరె సారయ్య, నేతలు రాయిశెట్టి శ్రీనివాస్, వోరెం భానుచందర్, యాసిన్, మధుసూదన్‌రెడ్డి, రాజమల్లు, సత్యనారాయణ, భూమయ్య, పర్లపెల్లి తిరుపతి, మహేశ్, నర్సింహరెడ్డి, సుధాకర్, పున్నంచందర్, క్రాంతి, మధు, శ్రీకాంత్, హరీశ్వర్మ, అఖిల్‌గౌడ్, ప్రవీణ్, శ్రీనివాస్, ముజాఫర్, రాజయ్య, ప్రభుఆనంద్, చరణ్, వైకుంటం ఉన్నారు.
సైదాపూర్, ఫిబ్రవరి17: మండల కేంద్రంలోని ప్రభు త్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు ముత్యాల వీరారెడ్డి, అబ్బిడి రవీందర్‌రెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, పైడిపల్లి రవీందర్‌గౌడ్, పైడిమల్ల తిరుపతి, తొంట రజినీకాంత్, తాటిపల్లి యుగేందర్‌రెడ్డి, పోతిరెడ్డి హరీశ్‌రావు, బానోత్ శంకర్‌నాయక్, రమేశ్‌నాయక్, కొంరయ్య, నారాయణ, ఆదిరెడ్డి, మహిపాల్‌సింగ్, వేణు, రమేశ్, శ్రీనివాస్, ఐలయ్య, రవి, రమేశ్, రాజిరెడ్డి, నరేశ్, తదితరులు ఉన్నారు.
ఇల్లందకుంట ఫిబ్రవరి 17: మండల కేంద్రంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్‌చేసి.. పండ్లు పంచిపెట్టారు. ఇక్కడ జడ్పీ మాజీ చైర్పర్సన్ విజయ, మాజీ ఎంపీపీ పావనివెంకటేష్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రామస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్లు కొంరెల్లి, వీరస్వామి, మాజీ ఎంపీటీసీలు ఓదెలు, విజయకుమార్, చి న్నరాయుడు, మాజీ సర్పంచులు మొగిలి, దిలీప్‌రెడ్డి, రజి తా వాసుదేవరెడ్డి, రాజకొంరయ్య, నేతలు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్, రాంరెడ్డి, కౌశిక్, రాజిరెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.
జమ్మికుంట, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. ఇక్కడ పార్టీ పట్టణాధ్యక్షుడు టంగుటూరు రాజ్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ పొనగంటి సంపత్, పొడేటి రామస్వామి ఉన్నారు.
రామడుగు, ఫిబ్రవరి17: వెలిచాల శివారులో గల ప్రశాంత్ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామడుగు సింగిల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అనాథ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి.. సంబురాలు జరుపుకొన్నారు. చిన్నారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ప్రశాంత్భవన్ ఆవరణలో మొక్కలు నాటారు. గోపాల్రావుపేటలో గ్రామశాఖ అధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వేడుకల్లో గంగాధర సింగిల్‌విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, రామడుగు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు మామిడి తిరుపతి, గంట్ల వెంకటరెడ్డి, పూడూరి మణెమ్మ మల్లేశం, వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు వీర్ల సంజీవరావు, మాజీ సర్పంచులు పంజాల ప్రమీల జగన్మోహన్గౌడ్, చాడ ప్రసన్న చంద్రశేఖర్‌రెడ్డి, గుండి మాన స ప్రవీణ్, చిలుముల రజిత ప్రభాకర్, సైండ్ల కవిత కరుణాకర్, జవ్వాజి శేఖర్, జూపాక తులసిప్రియ మునీందర్, మాజీ ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, ఆర్బీఎస్ మండ ల మాజీ కన్వీనర్ జూపాక కారుణాకర్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, నాయకులు మధు, ప్రశాంత్, మల్లేశం, రమేశ్, కమలాకర్, కార్తీక్, బసంతం, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, ఫిబ్రవరి17: పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, మాజీ సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, గన్ను శ్రీనివాస్‌రెడ్డి నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్‌కుమార్, బందారపు అజయ్‌కుమార్, ఏనుగు స్వామిరెడ్డి, మారం యువరాజ్, పెద్దెల్లి అనిల్, మావురం మహేశ్, బీసవేని రాజశేఖర్, ఉస్కెమల్ల మధు, ముద్దంకుమార్, వడ్లూరి భుమయ్య, నరేశ్ రావణ్, లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.
తిమ్మాపూర్ రూరల్, ఫిబ్రవరి17: నుస్తులాపూర్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి.. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఇక్కడ నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ల్యాగల వీరారెడ్డి, బేతి శ్రీనివాస్‌రెడ్డి, పెట్టం రమేశ్, ముప్పడి సంపత్ రెడ్డి, వంతడుపుల సంపత్, కనకం కొమురయ్య, పాశం అశోక్‌రెడ్డి, వంగాల శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌గౌడ్ ఉన్నారు.
శంకరపట్నం, పిబ్రవరి 17: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. తర్వాత మొక్కలు నాటారు. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె సంజీవరెడ్డి, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, గుర్రం రామస్వామి, గజెల్లి హనుమం తు, కల్లూరి పోచయ్య, గుర్రం శ్రీకాంత్, గొడిశాల తిరుపతి, పార్థసారథి, గూల్ల రమేశ్, సుభాష్‌రెడ్డి, ఎండీ అలీం, తాళ్లపల్లి శ్రీనివాస్, కల్లెపల్లి క్రాంతికుమార్, నాగయ్య, వావిలాల రాజు, రాజనర్సు ఉన్నారు.
గన్నేరువరం, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం కేక్ కట్ చేసి.. స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, పీచు మహేందర్‌రెడ్డి, వెంకటమల్లు ఉన్నారు.
కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 17: శాతవాహన యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ నేతలు మల్లెంకి శ్రీనివాస్, బీఆర్ఎస్వీ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, నేతలు సముద్రల ఓంకార్, సయ్యద్ సోహెల్, నాయిని అన్వేశ్ ఉన్నారు.
చిగురుమామిడి, ఫిబ్రవరి 17: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నేతలు కేక్ కట్ చేసి పండ్లు పం పిణీ చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో రోగులకు పం డ్లు పంచిపెట్టారు. ఇక్కడ మాజీ ఎంపీపీ కొత్త వినీత, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, ఆర్బీఎస్ మండల మాజీ కోఆర్డినేటర్ పెనుకుల తిరుపతి, నాయకులు సన్నీల వెంకటేశం, సర్వర్‌పాషా, బెజ్జంకి లక్ష్మణ్, దుడ్డెల లక్ష్మీనారాయ ణ, కూతురు శరభందరెడ్డి, అనుమాండ్ల సత్యనారాయణ, మక్బుల్పాషా, ముకెర సదానందం, బోయిని శ్రీనివా స్, ఎస్కే సిరాజ్, పెసరి రాజేశం, బుర్ర తిరుపతి, నాగేల్లి రాజిరెడ్డి,బోయిని శంకర్, బొట్ల తిరుపతి ఉన్నారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 17: చెర్లభూత్కూర్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, అధ్యక్షుడు కూర శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. స్వీట్లు పంచిపెట్టారు. ఇక్కడ మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి, నాయకులు జక్కు ల అజయ్, పోచమల్లు అనంతరెడ్డి, శంకర్ ఉన్నారు. చామనపల్లిలో మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కేక్ కట్ చేశారు. ఇక్కడ గర్వంధ శ్రీనివాస్, నర్సయ్య ఉన్నారు.