Vemulawada | వేములవాడ, మార్చి 13 : వేములవాడ పట్టణంలో కవయిత్రి మొల్ల 596వ జయంతి వేడుకలను శుక్రవారం శాలివాహన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్ హాజరై మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణాన్ని ఐదు రోజులలో తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి మొల్ల అని కొనియాడారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్, కొండ రాజశేఖర్, తోట రాజు, శాలివాహన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేశం, సంఘం నాయకులు మల్లేశం, అంజయ్య, పరుశరాములు, లక్ష్మీనారాయణ, దశరథం తదితరులు పాల్గొన్నారు.