ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ ఇన్ గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
రాంనగర్, జనవరి 29 : కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ ఇన్ గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సర్వర్ మాట్లాడుతూ దాదాపు 100కు పైగా ఆటోల్లో డ్రైవర్ పకన అమర్చిన సీట్లను, మ్యూజిక్ సిస్టంలను, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా అమర్చిన పరికరాలను తొలగించామన్నారు.
ప్రతి ఆటో డ్రైవర్తోపాటు ఇతర రోడ్డు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను చేరవేయరాదని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్లు రాజు, సాగర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

