కార్పొరేషన్, ఆగస్టు 2: ఇటీవలి భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు, కాలువలు, చెరువులు, కెనాల్ పంట నష్టాలపై అంచనాలు పక్కాగా ఉండాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో భారీ వర్షాలు, వరద నష్టంపై బుధవారం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వాటికి మరమ్మతుల కోసం ప్రభుత్వం 500 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. గతంలో కురిసిన వర్షాల కంటే ఈసారి వర్షపాతం తకువగా ఉన్నా ఒకే ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడడంతో నష్టం వాటిల్లిందని చెప్పారు.
అంచనాలు సిద్ధం చేయాలి
గురువారం నుంచి మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకుసాగాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లకు తాతాలిక మరమ్మతులు చేపట్టాలని, నష్టంపై అంచనాలను సిద్ధం చేసి అసెంబ్లీ సమావేశాల్లోగా ప్రభుత్వానికి నివేదించాలని చెప్పారు. వరదలతో వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా పంట పొలాల్లోకి ఇసుక వచ్చి చేరడంతో తీవ్రంగా పంట పొలాలకు నష్టం వాటిల్లిందని, పొలాలను తిరిగి వ్యవసాయానికి అనుకూలంగా మార్చేలా ఇసుక మేటలను ఉపాధి కూలీల ద్వారా తొలగించేలా ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపించాలని డీఆర్డీవోను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3945 ఎకరాల్లో వరి, 788 ఎకరాల పత్తి ,31 ఎకరాల్లో మక్క, ఆరెకరాల్లో కూరగాయల తోటలు నష్టపోయాయన్నారు.
భరోసా కల్పించాలి
వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహంచి అవసరమైన మందులతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాలు, వరదలతో ఎకడా ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు అనుమతించిన ఇరిగేషన్, రోడ్లు, ఇతర పనులపై సంబంధిత అధికారులు, గుత్తేదారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎకడా మంచినీరు, విద్యుత్ సరఫరాల్లో అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు ఎకడా విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా చూసిన ఆ శాఖ అధికారులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు ఉన్నారు.
ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం..
వరదలతో జిల్లాలో ఏర్పడ్డ శాశ్వత, పాక్షిక నష్టా న్ని గుత్తేదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇతర శాఖల అధికారులతో సమీక్షిస్తు న్నాం. దెబ్బతిన్న కల్వర్ట్, కెనాల్ రీడిజైనింగ్ కో సం పకా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామ ని, పొలాల్లోకి చేరిన ఇసుక మేటను తొలగించేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. కాంట్రాక్టర్లు, అధికారులతో సమావేశమై, పనులజాప్యానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు.
– బీ గోపీ, కలెక్టర్
హుజూరాబాద్‌లో తీవ్ర నష్టం జరిగింది..
హుజూరాబాద్ నియోజకవర్గంలో వరదలతో తీవ్రనష్టం వాటిల్లింది. 4వేల ఎకరాలకు నీరందించే కల్వల ప్రాజెక్టు తెగిపోవడం బాధాకరం. కొత్తపల్లి – గన్ముకుల, గన్ముకుల – మల్లన్నపేట, గంగారం – బోత్తపల్లి, వీణవంక – లక్ష్మకపేట తదితర గ్రామాల మధ్య రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. హుజూరాబాద్‌లో చెరువు మత్తడి ఎత్తు పెంచాలి. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. హుజూరాబాద్ దవాఖానలో గైనకాలజిస్టుల కొరత ఉంది. వెంటనే నియమించాలి. జమ్మికుంటకు చెందిన గైనకాలజిస్టు హుజూరాబాద్ దవాఖానలో పనిచేస్తున్నందున అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. డాక్టర్‌ను తిరిగి జమ్మికుంటకు కేటాయించాలి. ఇంకా ఐసీయూను తెరిపించాలి.
– పాడి కౌశిక్‌రెడ్డి, మండలి విప్
నారాయణపూర్ కట్ట ఎత్తు పెంచాలి
నారాయణపూర్ చెరువు రీఎస్టిమేట్ చేసి కట్ట ఎత్తు పెంచాలి. భారీ వరదలకు చెక్ డ్యాంలు కొట్టుకుపోకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులు చేయాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
పనులు త్వరగా పూర్తి చేయించాలి..
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీల ద్వారా గతం లో టెండర్ పనులు పూర్తయిన పనుల్లో నిర్లక్ష్యం జరుగుతోంది. వాటితో పాటుగా ప్రస్తుతం చేపట్టనున్న పనులు కూడా త్వరగా పూర్తి చేయించాలి. నియోజక వర్గంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు వెనువెంటనే చర్యలు తీసుకోవాలి.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే