Karimnagar | మళ్ళీ తెరపైకి భూమాఫియా.. కరీంనగర్ నడిబొడ్డున విలువైన భూమికి ఎసరు
Karimnagar | కరీం'నగరం'లో భూ కబ్జాల బాగోతం మళ్లీ తెరపైకి వస్తున్నది. గతంలో సీపీ అభిషేక్ మహంతి భూ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో సద్దుమణిగిన వివాదాలు, తిరిగి కొత్త రూపంలో ఊపిరి పోసుకుంటున్న తీరు కలకలం రేపుతున్నది.
Karimnagar | కరీం’నగరం’లో భూ కబ్జాల బాగోతం మళ్లీ తెరపైకి వస్తున్నది. గతంలో సీపీ అభిషేక్ మహంతి భూ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతో సద్దుమణిగిన వివాదాలు, తిరిగి కొత్త రూపంలో ఊపిరి పోసుకుంటున్న తీరు కలకలం రేపుతున్నది.
నగరం నడిబొడ్డున, వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సామాన్యుల విలువైన భూమిని, కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఓ జాతీయ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధితోపాటు 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టుకు అన్నీ సిద్ధం చేయగా.. మరో జాతీయ పార్టీకి చెందిన నేత అరెస్టులు ఆపాలంటూ ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలిసింది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందన్న చర్చ సాగుతున్నది. ఇదే సమయంలో నిందితులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుండడం, బాధితులకు ఆందోళన కలిగిస్తున్నది. బాధితుల పక్షాన ఉండాల్సిన ఓ జాతీయ పార్టీ నేత ఏకంగా అక్రమార్కులవైపు నిలబడడం చూస్తే.. ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
కరీంనగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలం గాణ ప్రతినిధి): కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కోతిరాంపూర్‌లో విలువైన దాదాపు మూడు గుంటల సామాన్యుల భూమి కబ్జాకు యఅత్యంత విశ్వసనీయ సమాచా రం. నగరంలో కూలి పనులు చేసుకుంటూ జీవించే ఇద్దరు అన్నదమ్ములు, 2019లో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పుడే హ ద్దులు ఏర్పాటు చేసుకొని, భూమిని జాగ్రత్త గా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ క్రమం లో పక్క సర్వే నంబర్‌కు చెందిన కొందరు వ్యక్తులు.. ఆ భూమి తమదని నకిలీ పత్రా లు సృష్టించి, కబ్జాకు తాజాగా ప్రయత్నించి నట్టు తెలిసింది. నిజానికి ఈ వివాదం ఇప్ప టిది కాదు. 2024లో అభిషేక్ మహంతి సీపీ గా ఉన్న సమయంలోనే ఈ వ్యవహారం పో లీసుల దృష్టికి వెళ్లింది. అప్పట్లో సర్వే ప్రకారం నడుచుకుంటామని, ఎలాంటి గొడవలు చేయబోమని నిందితులు పోలీసులకు హామీ ఇచ్చిన్నట్టు సమాచారం. దీంతో ఈ వివాదం అప్పట్లో సద్దుమణిగినప్పటికీ.. తాజాగా మళ్లీ అదే భూమిపై పేచీ మొదలైంది. నకిలీ పహాణీలు సృష్టించి, అధికారుల సంతకా లను ఫోర్జరీ చేసి, ఏకంగా ఆ భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తున్నది.
విచారణలో బట్టబయలు
తమ భూమి సరిహద్దులను చెరిపివేయ డాన్ని గుర్తించిన యజమానులు, తిరిగి పోలీ సులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆ భూమి తమదేనంటూ నిందితులు చేసుకున్న రిజిస్ట్రేషన్ పత్రాలను చూపించడంతో పాటు కబ్జాకు పాల్పడుతున్న సదరు మాఫియా వ్యక్తులు చూపిస్తున్న పత్రాలు చూపించారు. ఆ వ్యక్తులపై చర్యలు తీసుకో వాలని కోరుతూ వన్స్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ పత్రా లపై కరీంనగర్ అర్బన్ తహసీల్ ఆఫీసు వివరణ కోరినట్టు తెలిసింది. ఆ మేరకు విచా రణ జరిపిన తహసీల్దార్.. పత్రాలు, సంతకాలు, స్టాంపులు ఫోర్జరీ చేసినవేనని కార్యా లయం నుంచి పోలీసులకు నివేదిక సమ ర్పించినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు భూమి కబ్జా వ్యవహారంలో భాగస్వాములుగా ఆరోప ణలు ఎదుర్కొంటున్న ఓ మాజీ కార్పొరేటర్ సహా మొత్తం 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కబ్జాతోపాటు పలు నాన్‌బె యిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తులను అరెస్టు చేసేందుకు పోలీసులు అన్నీ సిద్దం చేశారు. కానీ, అంతలోనే ఒత్తిళ్లు మొదలయ్యాయి.
అక్రమార్కులకు అండగా?
అక్రమార్కులకు ఇక శిక్ష తప్పదని భావి స్తున్న తరుణంలో నిందితులు తమ పార్టీకి చెందిన నేతలను కాదని, మరో జాతీయ పార్టీకి చెందిన నాయకుడి వద్దకు వెళ్లినట్టు తెలు స్తున్నది. అయితే, సదరు నేతకు అసలు విష యం చెప్పకుండా.. తమకు అనుకూలంగా విషయాన్ని వివరించినట్లు సమాచారం. వా స్తవాలు తెలుసుకొని బాధితుల పక్షాన నిలు వాల్సిన ఆ జాతీయ పార్టీ నేత.. నిందితుల మాటలను నమ్మి, ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ ఆపాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలి సింది. దాంతో భూమి ఆక్రమణకు సంబం ధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఇప్ప టికే ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశామని, వారిని అరెస్టు చేయక తప్పదని ఆ నేతకు పోలీసులు స్పష్టం గా చెప్పినట్టు సమాచారం. అలా అయితే అరెస్టుకు కొంత సమ యం ఇవ్వా లని సదరు నేత ఒత్తిడి చేయగా.. చివరకు పోలీసులు తలొగ్గినట్టు సమాచారం. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితులు, ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొద లుపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు ఆందోళన చెందుతు న్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఓ జాతీయ పార్టీ ప్రజాప్రతినిధి చూపిన చొర వ, పోలీసులకు ఇచ్చిన ఆదేశాల వల్ల సామా న్యులకు అన్యాయం జరగడమే కాకుండా.. రెండు జాతీ య పార్టీల మధ్య జరుగు తున్న చీకటి ఒప్పందాలను బహిర్గతం చేసిందన్న చర్చ జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుకు వెళ్తారా..? లేక ముందస్తు బెయిల్ వచ్చే వరకు నిందితులకు అవకాశం ఇస్తారా..? అన్నది మున్ముందు తేలనున్నది. నిందితుల్లో ఓ ప్ర జాప్రతినిధి ఒక జాతీయ పా ర్టీకి చెందినవారు కాగా, వారిని అరెస్టు చేయ కుండా కాపాడింది మరో జాతీయ
పార్టీ నేత కావడం కొసమెరుపు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

