హుజూరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని శనివారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ వ్యాపార, వాణిజ్య, పలు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో డీఏవో జగత్సింగ్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ సునీత, ఎంవీఐ కార్యాలయంలో ఎంవీఐ సిరాజ్ ఉర్ రహమాన్, ఐసీడీఎస్‌లో సీడీపీవో భాగ్యలక్ష్మి, ట్రాన్స్‌కో కార్యాలయంలో డీఈ విజేందర్ రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండో కార్యాలయంలో అధ్యక్షుడు ఎడవెళ్లి కొండల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్లో చైర్పర్సన్ రమానాయక్, రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ జనార్దన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ పరమేశ్, కేజీబీవీలో ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గందె రాధిక, కార్మికశాఖ కార్యాలయం వద్ద ఏఎల్వో చందన, పోలీస్‌స్టేషన్‌లో టౌన్ సీఐ వీ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంఈవో కార్యాలయం వద్ద ఎంఈవో నర్సింహారెడ్డి, ఏరియా దవాఖానలో సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, హుజూరాబాద్ కోర్టులో జడ్జి డీవీ నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్లో అధ్యక్షుడు బీ కళాధర్, ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ పీ అర్పిత మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్ మక్సూద్ అలీ, బీఎస్ఎన్ఎల్ డీఈ విజయభాస్కర్‌రెడ్డి, వెటర్నరీ ఏడీఏ శ్రీనివాస్, జైలర్ గణేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నిర్మల, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో డాక్టర్ చందు, టీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బల్దియా వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఫైళ్ల వెంకట్‌రెడ్డి, హనుమాన్ దేవాలయ చైర్మన్ బూసారపు బాపురావు, టీఎన్జీవో అధ్యక్షుడు సీ సందీప్, ఏరియా దవాఖాన ఆర్ఎంవో సుధాకర్‌రావు, ఎస్ఐలు వీరన్న, ఆసిఫ్, నాయబ్ తహసీల్దార్ ఎన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి, తుమ్మనపల్లి, జూపాక సింగిల్ విండో కార్యాలయాల్లో చైర్మన్లు కౌరు సుగుణాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట, సెప్టెంబర్ 17: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ మాధవి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పావని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో కేడీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుపతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు జ్యోత్స్న, పశువైద్యశాలలో వైద్యుడు రాజు, శ్రీ సీతారామచంద్రంస్వామి దేవాలయంలో ఈవో సుధాకర్, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సదానందంతో పాటు పలు కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు ఉన్నారు.
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాజయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఐకేపీలో ఏపీఎం కొమురయ్య, పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, కో ఆప్షన్‌మెంబర్ హమీద్, ఎంపీటీసీలు నల్ల మమత-తిరుపతిరెడ్డి, ఎలవేన సవిత- మల్లయ్య, చదువు స్వరూప-నర్సింహారెడ్డి, ఒడ్డెపెల్లి లక్ష్మి-భూమయ్య, ఉపసర్పంచ్ భానుచందర్, ఏవో గణేశ్, డీటీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో ప్రభాకర్, ఏఈవోలు అచ్యుత్, సంగీత, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దొడ్డె మమత, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరి, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, పట్టణ పోలీస్ స్టేషన్లో టౌన్ సీఐ రాంచంద్రారావు, రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ సురేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఏవో కార్యాలయంలో ఏవో గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్లో ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ పొనగంటి సంపత్, ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ఎంలు, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎంపీడీవో సతీశ్‌కుమార్‌తో పాటు అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.