కలెక్టరేట్, జూన్ 29 : గణాంకాధికారులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. భారతీయ గణాంక పితామహుడు ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్ 129వ జయంతిని బుధవారం నగరంలో ని గణాంక భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఆర్థిక ప్రణాళికలు, గణాంకాల అ భివృద్ధి కోసం ప్రొఫెసర్ మహలానోబిస్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కనుగొన్న సిద్ధాంతాలే గణాంకాల కోసం నేటికీ ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కచ్చితమైన సమాచారం సేకరించినందునే రైతుబంధు, దళిత బంధు పథకాలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఏదైనా అభివృద్ధి సాధించాలంటే గణాంకాలే ముఖ్యపాత్ర పోషిస్తాయనే వాస్త వం గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా 2021 గణాంక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎస్‌యూ రిజిస్ట్రార్ మంతెన వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి జాతీయ గణాంక దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు. ఈ సారి అభివృద్ధికి కావాల్సి న సమాచారం ఎలా సేకరించామనే దానిపై సూచనలు చేశా రు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో చేసిన తీర్మానాలకు అనుగుణంగా పేదరిక నిర్మూలన, ఆకలి చావుల అంతం, పరిశుభ్రమైన నీరు, గాలి, విద్య, ఉద్యోగాల కల్పన, పర్యావరణ పరిరక్షణ, ఇతర లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు రూ పొందించాలని కోరారు. ప్రణాళిక సంయుక్త సంచాలకులు, ముఖ్య ప్రణాళికాధికారి డీ కొమురయ్య మాట్లాడుతూ.. 2021లో జిల్లాలోని 57 శాఖల సమాచారం సేకరించి గణాంక పుస్తకం రూపొందించినట్లు వెల్లడించారు. జాతీయ గణాంకాధికారి జీ శ్రీనివాస్‌రావు, కుమార్, గణాంకాధికారి వీ రాందత్తారెడ్డి, శ్రీనివాస్, ఉపగణాంకాధికారి సంపత్‌కుమార్, జ్యోతి, తిరుపతి, ఎంపీవోలు పాల్గొన్నారు.