బోయినపల్లి, జూన్ 22: మండలంలోని కోరెం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సామ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెన్నాడి అమిత్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వనించారు.
అనంతరం ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ నుంచి ఎప్పుడు చేరిన వారికి టీఆర్ఎస్లో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్రెడ్డి, ఎంపీటీసీ డబ్బు మమ త, ఉపసర్పంచ్ గాజర్ల రోహిణి, ఏఎంసీ సభ్యురాలు జంపుక మాధవి, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, టీఆర్ఎస్ మండల నాయకులున్నారు.