హుజూరాబాద్‌టౌన్, జూన్ 22: దళిత బంధుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌కు చెందిన బండ సత్యంకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన మార్బుల్ బండల షాపును బండ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం దక్కుతున్నదన్నారు.
దళితులు ఆర్థికాభివృద్ధి సాధించడానికే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ముందుకు సాగాలని సూచించారు. అలాగే గాంధీనగర్‌లో మాడుగుల సానియాకు మంజూరైన నిస్సీ సారీ సెంటర్‌ను 29వ వార్డు కౌన్సిలర్ ముక్క రమేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.