ధర్మపురి, జూన్ 22: ఆపదలో ఉన్న పేదలకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి అభయహస్తం అందిస్తూ వారికి కొండంత అండ గా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. సాయం చేయాలని మంత్రిని కోరగా రూ.లక్ష విలువైన ఎల్వోసీని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అత్యవసర చికిత్స కోసం దరఖాస్తులు చేసుకున్న పేదవారికి నేనున్నానంటూ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వా రా వైద్య ఖర్చులు చెల్లిస్తున్నదన్నారు. అలాగే ముందుగా దవాఖాన ఖర్చులు చెల్లించుకోలేని వారికి లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్ఓసీ)అంజేస్తున్నామన్నారు. ఈ సంధర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
శుభకార్యానికి హాజరు
వెల్గటూర్, జూన్ 22: టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల నాయకుడు బొడ్డు సంతోష్- శిరీష వివాహం బుధవారం కిషన్‌రావుపేటలో శ్రీనాగపల్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద కల్యాణ మండపంలో జరిగింది. మంత్రి కొప్పు ల ఈశ్వర్-స్నేహలత దంపతులు, రాష్ట్ర నాయకుడు పొనుగోటి శ్రీనివాసరావు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇక్కడ ఎంపీపీ కునమల్ల లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సర్పంచ్ బోడకుంటి రమేశ్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.