ధర్మపురి, నవంబర్ 18: పట్టణంలోని నంది చౌక్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి, సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. క్రిభ్కో భాగస్వామ్యంతో బహుళ ప్రయోజనాలున్న ఇథనాల్ పరిశ్రమ నియోజకవర్గంలో ఏర్పాటుతో ఇక్కడి యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు రైతులకు ప్రయోజనం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఆర్బీఎస్ మండల, పట్టణ కో-ఆర్డినేటర్లు సౌళ్ల భీమయ్య, వొడ్నాల మల్లేశం, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్‌రెడ్డి, రామయ్యపల్లి సర్పంచ్ మెడపట్ల దుబ్బయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మొగిలి శేఖర్, పట్టణాధ్యక్షుడు ఆకుల రాజేశ్, కౌన్సిలర్లు అయ్యోరి వేణు, తిర్మందాసు అశోక్, నాయకులు అక్కనపల్లి సునీల్‌కుమార్, పురాణపు సాంబు, అనంతుల లక్ష్మణ్, దండవేని గంగమల్లయ్య, అలీం, బండి సుధాకర్ గౌడ్, రంగు అశోక్, లక్కాకుల భగవంతరావు, గడ్డం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, ఏఎంసీ చైర్మన్ నగావత్ తిరుపతినాయక్, పార్టీ జిల్లా నాయకుడు సురేందర్‌రెడ్డి, సర్పంచులు మేరుగు శ్రీనివాస్, ఉప్పలంచ లక్ష్మణ్, గాజుల రాకేశ్, మండల నాయకులు మడిగెల తిరుపతి, నేరెళ్ల గంగాధర్, గొర్రె ప్రశాంత్, పలుమారు విజయ్‌యాదవ్, పన్నాటి గంగాధర్, బోగ లక్ష్మీనారాయణ, రౌట్ల లచ్చయ్య, రాచకొండ లక్ష్మణ్, గొల్లపల్లి రాంచం ద్రం, లక్ష్మణ్ తదితరులున్నారు.
మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇథనాల్ రైస్‌బ్రాన్, ఆయిల్ ఫ్యాక్టరీ మంజూరు చేసి ఈ ప్రాంతంలోని రైతులకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోస్కుల జలంధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేశ్, చందోలి ప్యాక్స్ చైర్మన్ గందె వెంకట మాధవరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు అమ్జద్, మండల కో -ఆప్షన్ సభ్యుడు అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మారంపెల్లి బాబు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పడాల జలంధర్, సర్పంచుల ఫోరం జిల్లా, మండలాధ్యక్షులు గంగారెడ్డి, ఎరవేని రమేశ్, గొల్లపల్లి ఉప సర్పంచ్ మార్గం రాజశేఖర్, నాయకులు బలభక్తుల కిషన్, చందు, మ్యాదరి రమేశ్, సామల వీరస్వామి, రామానాయక్, అక్బర్ అలీ, శ్రీనివాస్, జనుప వెంకటేశ్, గురజాల బుచ్చిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలీ వద్ద ఎంపీపీ కునమల్ల లక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు బోడకుంటి రమేశ్, అనుమాల తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ గోలి రత్నాకర్, నాయకులు చల్లూరి రాంచందర్ గౌడ్, బొడ్డు రామస్వామి, లింగయ్య, జూపాక కుమార్, కుమ్మరి వెంకటేశ్, బిడారి తిరుపతి, గుండా జగదీశ్వర్ గౌడ్, రంగు తిరుపతి, పడిదం వెంకటేశ్, గాజుల బానేశ్, మద్ది మురళి, సుధాకర్‌రావు, సత్తయ్య, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన నాయకులు
మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి, చందోలి సర్పంచ్ అలిశెట్టి రవీందర్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.