కరీంనగర్, జూన్ 7 (నమసే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి పనులు ఊరూరా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శ్రమదాన కార్యక్రమాలు.. పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణ ప్రగతిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మంగళవారం మంత్రి గంగుల కమలాకర్. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై.సునీల్రావులతో కలిసి కరీంనగర శివారులో డంప్‌యార్డులో బయోమైనింగ్ ద్వారా క్లీనింగ్ చేసే పనులను ప్రారంభించారు. శంకరపట్నం మండలం ధర్మారం గ్రామాన్ని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించారు. డీపీఓ వీరబుచ్చయ్యతో కలిసి వీధుల్లో కలియదిరిగారు. పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. చిగురుమామిడి మండలం ములనూర్, పీచుపల్లి, చిగురుమామిడి జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్ పర్యటించారు. హరితహారం నర్సరీ,సెగ్రిగేషన్ షెడ్ పరిశీలించి మొకలు నాటారు. అంగన్వాడీ సూళ్లను పరిశీలించి చిన్నారులతో మాట్లాడారు. హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 30 వార్డులలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. కొత్తపల్లి పట్టణంలోని 12వ అభివృద్ది పనులను మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పరిశీలించారు.