మంథని టౌన్, మే 30: కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ, తానూ అండగా ఉంటామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకుడు భూపెల్లి రాజు తన అనుచరులతో కలిసి మంథనిలోని రాజగృహలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సమక్షంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రా జుతో పాటు మెరుగు శేఖర్, బోడ ఏడుకొండ లు, మంతెన సుమన్, సాయి, మహేశ్, శ్రీధర్, రాకేష్, దామోదర్, భీమయ్య,సందీప్, శ్రీకాం త్, కళ్యాణ్, అజయ్, సిద్దు, రాజేందర్, శ్రీహరి, రవీందర్ సుమారు 50 మంది టీఆర్ ఎస్ పార్టీలో చేరగా పుట్ట మధూకర్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ కో సం పని చేసే కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఇటీవల ధన్వాడలో నిర్వహించిన రచ్చబండలో మంథని ఎమ్మెల్యే మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నిర్వహించిన రచ్చబండ కార్యక్రమ వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలతాశంకర్లాల్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఏగోళపు శంకర్, మహిళా అధ్యక్షురాలు ఓదెలు పాల్గొన్నారు.