మానకొండూర్ రూరల్, మే 30: సమష్టిగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా కులం పేరుతో దూషిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
చిగురుమామిడి మండలం రేకొండలో..
చిగురుమామిడి, మే 30: మండలంలోని రేకొండ గ్రామంలో పౌరహకుల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కులమతాలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంబేదర్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలన్నారు. అంటరానితనం, కుల వివక్షకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, ఎస్ఐ దాస సుధాకర్, ఏపీవో లక్ష్మీ పేరందేవి, సర్పంచ్ పిట్టల రజిత, ఎంపీటీసీ కొత్తూరు సంధ్య, ఉప సర్పంచ్ చాడ మైపాల్‌రెడ్డి, అంబేదర్ సంఘం అధ్యక్షుడు బోయిని అశోక్, మాజీ సర్పంచ్ మామిడి అంజయ్య, ఆర్ఐ రాజు, పంచాయతీ కార్యదర్శి లావణ్య, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామస్తులున్నారు.
తిమ్మాపూర్ మండలం నేదునూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, మే 30: మండలంలోని నేదునూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. పౌరులంతా సోదరభావంతో మెలగాలని తహసీల్దార్ రాజ్‌కుమార్ సూచించారు. చట్టాల గురించి వివరించారు. సర్పంచ్ వడ్లూరి శంకర్, ఎంపీవో కిరణ్‌కుమార్, ఆర్ఐ అనీల, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులున్నారు.
నేడు శంకరపట్నం మండలం రాజాపూర్‌లో..
శంకరపట్నం, మే 30: మండలంలోని రాజాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం 11గంటలకు పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. మండలస్థాయి అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.