రామడుగు, మే 29: ధాన్యం దిగుమతి చేసుకునే క్రమంలో రైతులకు మిల్లర్లు సహకరించాలని రామడుగు సింగిల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు సూచించారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని నాబార్డు గోదాములను ఆదివారం ఆయన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతున్నదని, గోపాల్‌రావుపేటలోని గోదాముల్లో నిల్వ చేయాలని వీర్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కలిసి విన్నవించారు. వెంటనే స్పందించి కలెక్టర్‌తో మాట్లాడి గోదాముల్లో ధాన్యం నిల్వ చేసేందుకు అనుమతి ఇచ్చారు. కాగా, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు గోదాములను పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 40 మంది బీహార్ కూలీలు 24 గంటలు ధాన్యం అన్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు, సహకార సంఘం సిబ్బంది రైతులకు అసౌకర్యం కలుగకుండా గోదాముకు వచ్చే ప్రతి వాహనాన్ని లోపలికి అనుమతించి ధాన్యం త్వరగా అన్లోడ్ చేసేలా చూడాలన్నారు. గోదాముల్లో ధాన్యం నిల్వ చేయడానికి సహకరించిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు వీర్ల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పైండ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎడవెల్లి పాపిరెడ్డి, సింగిల్‌విండో కార్యదర్శి మల్లేశం, సిబ్బంది పాల్గొన్నారు.