గంగాధర, సెప్టెంబర్ 22: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా కురిక్యాల గ్రామానికి చెందిన మేచినేని నవీన్‌రావును మంగళవారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలే పట్టుగొమ్మలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాడు ఉద్యమ పార్టీగా నేడు రాజకీయ పార్టీగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుందన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గంగాధర, సెప్టెంబర్ 21: టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా మేచినేని నవీన్‌రావు రెండోసారి ఎన్నిక కావడంపై మండలంలోని సర్పంచులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మధురానగర్ చౌరస్తాలో నవీన్‌రావును సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్‌రెడ్డి, శ్రీమల్ల మేఘరాజు, ముక్కెర మల్లేశం, రాసూరి మల్లేశం, ఉపసర్పంచ్ నిమ్మనవేణి ప్రభాకర్, నాయకులు రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, వేముల అంజి, ముద్దం నగేశ్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, దోమకొండ మల్లయ్య, రాజుల కిషన్, రాములు, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.