హుజూరాబాద్‌టౌన్, మే 30: దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్‌కు చెందిన మోరె మధు-పవిత్రకు దళిత బంధు కింద మంజూరైన గూడ్స్ వాహనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో దళితులను పట్టించుకున్న వారే లేరని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అనంతరం బండ శ్రీనివాస్‌ను లబ్ధిదారులు శాలువాతో సత్కరించారు. కౌన్సిలర్ కొండ్ర జీవిత-నరేశ్, పాస్టర్ జాన్, మాజీ ఎంపీటీసీ బీంపల్లి రాజలింగం, టీఆర్ఎస్ నాయకులు సంపంగి రాజేందర్(మైకెల్), సదానందం, ప్రసాద్, భిక్షపతి, భాస్కర్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.