సారంగాపూర్, మే 27: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని పెంబట్ల గ్రామానికి చెందిన కొలిపాక లక్ష్మీరాజానికి మంజూరైన ట్రాక్టర్, బీర్పూర్ మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన పూడూరి రాజ్‌కుమార్‌కు మంజూరైన కారును శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రారంభించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ వారిని లక్షాధికారులను చేయాలనే సంకల్పంతో దళితబంధును ప్రారంభించారని తెలిపారు. లబ్ధిదారులు దళితబంధును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొల్ముల రమణ, కోల శ్రీనివాస్, గురునాథం మల్లారెడ్డి, గొర్ల సుశిన్, మర్రిపెల్లి రాజేశం, రవి, నారాయణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.