కమాన్‌చౌరస్తా, మే 21: మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలని టీఎస్ డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శనివారం ఆయన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమం అమలులో చేయడంలో ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించారన్నారు. మూడు విడుతల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పాఠశాలల అభివృద్ధి విషయంలో నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దన్నారు. సిబ్బంది ఎదురొంటున్న సమస్యల పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, టీఎస్ డబ్ల్యూఐడీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి సారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఈఈ వీరూపాక్ష, డీఈలు విన్సెంట్ రావు, నాగేశ్వరా చారి, ఏఈలు, సైట్ ఇంజినీరింగ్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.