రామడుగు, మే 21: మండలంలోని హనుమాన్ ఆలయాల్లో శనివారం దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు. గోపాల్‌రావుపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గల భక్తాంజనేయ స్వామి ఉపాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, చందనాభిషేకం చేశారు. ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి హనుమాన్ దీక్షాపరులు ఊరేగించారు. మహిళలు స్వామి వారికి మంగళహారతులతో స్వాగతం పలికి, కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడ హనుమాన్ దీక్షాపరుడు సుద్దాల అనిల్ ఆంజనేయ స్వామి వేషధారణలో ఆకట్టుకున్నారు. వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వేద పండితుడు నమిలకొండ రమణాచార్యుల పర్యవేక్షణలో గ్రామస్తులు అష్టోత్తర శత కలశాభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని మకరతోరణంతో అలంకరించారు. గుండి హనుమాన్ ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
వెలిచాలలో సర్పంచ్ వీర్ల సరోజన, మాజీ సర్పంచులు వీర్ల నర్సింగరావు, రవీందర్రావు, హన్మాంతరావు, పూదరి తిరుపతి, మకరతోరణం దాత తాడెం తిరుపతి, హనుమాన్ దీక్షాపరులు, గోపాల్రావుపేటలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నార్ల రమేశ్, దొనపాటి సీతారాంరెడ్డి, ఎర్రోజు సత్యం, నాగమల్ల లచ్చయ్య, కొడిత్యాల రాంచంద్రం, ఎడవెల్లి మహిపాల్‌రెడ్డి, రాగుల అంజయ్య, ఆలయ అర్చకులు డింగిరి సత్యనారాయణాచార్యులు, దుర్శేటి రవికిరణాచార్యులు, హనుమాన్ భక్తులు బత్తిని మల్లేశం, బొమ్మరవేణి తిరుపతి, డా.రమేశ్, సుద్దాల అనిల్, వేల్పుల హరికృష్ణ, కాలువ కొమురయ్య, మణికంఠ, పవన్, గంగయ్య, వెంకటేశ్, సిద్ధు, గుండిలో హనుమాన్ భక్తులు ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్‌గౌడ్, మాధవాచారి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో హనుమాన్ దీక్షాపరుల ఆధ్వర్యంలో హనుమాన్ నగర సంకీర్తన, ఉత్సవమూర్తుల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు పట్టణంలోని పాత హనుమాన్ ఆలయం నుంచి నగర సంకీర్తన ప్రారంభమై పుర వీధుల గుండా ఉత్సవమూర్తులతో హనుమాన్ దీక్షాపరులు ఊరేగింపు తీశారు. శ్రీ వేంకటేశ్వరమణికంఠాలయంలో హనుమాన్ దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు.