బోయినపల్లి, మే 14: కల్యాణలక్ష్మి, షాదీ ము బారక్తో సర్కారు పేద కుటుంబాల్లో కల్యాణ కాంతులు నింపుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. బోయినపల్లిలో ఐదుగురు, బూర్గుపల్లిలో ఐదుగురు లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కలను అందజేశారు. ఈసందర్భంగా లబ్ధిదారులు సంతోషంతో ఎమ్మెల్యేకు మంగళహారతి పట్టి, నదుటిపై బొట్టు పెట్టి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే రవిశంకర్ చెక్కులు, తన సతీమణి దీవెన పంపించిన చీరెలను జూట్ బ్యాగులో పెట్టి అందించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు చక్కెర కుడుక లు పోశారు. అనంతరం తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ పనితీరు, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు పస లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షాలు మతిభ్రమించి మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో 20 ఏళ్ల వరకు తిరుగులేదన్నారు. జూలై చివరి వారంలో కొత్త ఆసరా పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో డీటీ నవీన్, సర్పంచులు గుంటి లతశ్రీ, అతికం లచ్చయ్య, కన్నం మధు, ఎంపీటీసీలు సంబ బుచ్చమ్మ, ఉపేందర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, మండ ల రైతు బందు సమితి కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ మేడుదుల మల్లెశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొడయ్య, కొండగట్టు ఆలయ కమిటీ సభ్యుడు ముద్దం రవి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కవ్వంపల్లి రాములు, డబ్బు సుజన్రెడ్డి, గుంటి శంకర్, సంబ లక్ష్మీరాజం, ఎడపల్లి బాబు, నల్లగొండ అనీల్, పిట్టల రమేశ్,రమేశ్, బొజ్జనరేశ్ తదితరులు ఉన్నారు.