చిగురుమామిడి, మే 12: సర్కారు బడుల అభివృద్ధి కోసమే ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. ‘మనఊరు- మనబడి’ మొదటి విడుతలో ఎంపికైన చిగురుమామిడి, ఇందుర్తి, ములనూర్, సుందరగిరి, నవాబుపేట, రేకొండ గ్రామాల్లోని మండల, జిల్లా పరిషత్ పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఆయా చోట్ల తరగతి గదులు, వంట షెడ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరా తదితర సదుపాయాలను పరిశీలించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రధానంగా నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విరూపాక్ష, డీఈ నాగేశ్వరాచారి, తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, మండల విద్యాధికారి ఆర్ విజయలక్ష్మి, ఏఈ కృష్ణమూర్తి, సర్పంచ్, ఎంపీటీసీలు బెజ్జంకి లక్ష్మణ్, శ్రీ మూర్తి రమేశ్, సుద్దాల ప్రవీణ్, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, మెడబోయిన తిరుపతి, మంకు స్వప్న, కొత్తూరి సంధ్య, పెసరి జమున, మక్బుల్ పాషా, ఉప సర్పంచ్ ఎలగందుల రాజయ్య ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, సభ్యులున్నారు.
హుజూరాబాద్ మండలంలో..
హుజూరాబాద్ టౌన్/ రూరల్, మే 12: ‘మన ఊరు – మనబడి’లో భాగంగా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, బోర్నపల్లిలోని ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ పరిశీలించారు. అలాగే కందుగుల, రాంపూర్, చెల్పూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ ఎల్ రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎంఈవో కొమ్మెర శ్రీనివాస్‌రెడ్డి, పాఠశాల ఇంజినీరింగ్ విభాగం డీఈ, ఎంపీఈవోతో పాటు ఎంపీడీవో జయశ్రీ, ఏఈ మల్లారెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మహేందర్‌రెడ్డి, సత్యప్రసాద్, వీ విష్ణుకుమార్, ఉమాదేవి, సానే అనురాధ, ఆసియా, మున్సిపల్ ఏఈలు గాండ్ల సాంబరాజు, సీఆర్పీ రంగు దామోదరాచారి, వర్ ఇన్స్పెక్టర్ వినయ్ ఉన్నారు.
సైదాపూర్ మండలంలో..
సైదాపూర్, మే 12: మన ఊరు- మనబడి కార్యక్రమంలో ఎంపికైన ఎక్లాస్పూర్, వెన్నంపల్లి, వెన్కేపల్లి, ఆకునూర్, రాయికల్, గొడిశాల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ సందర్శించారు. ఆయా పాఠశాలల పరిసరాలు, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వం ఆయా పాఠశాలలకు మరమ్మతులు చేయిస్తుందని, పూర్తి స్థాయిలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీవో పద్మావతి, ఎంఈవో కేతిరి వెంకట నర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.