గంగాధర, మే 7: సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతున్న ఓపీ, ఐపీ సేవలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ప్రసవాలపై ఆరా తీశారు. ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఆరోగ్య జాగ్రత్తలు చెప్పారు. అనారోగ్యంతో దవాఖానకు వచ్చే వారికి ఆరోగ్య సిబ్బంది భరోసా కల్పించి అవసరమైన మందులు అందజేయాలని సూచించారు. మధురానగర్ గ్రామానికి చెందిన పల్ల కవిత దవాఖానలో సాధారణ ప్రసవం కాగా, ప్రభుత్వం తరఫున కేసీఆర్ కిట్ అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్, అట్ల శేఖర్‌రెడ్డి, నిమ్మణవేణి ప్రభాకర్, ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, వేముల అంజి, పెంచాల చందు, మామిడిపెల్లి అఖిల్, సముద్రాల అజయ్, మ్యాక వినోద్ తదితరులు పాల్గొన్నారు.