కార్పొరేషన్, మే 7: స్మార్ట్‌సిటీ పనుల్లో వేగం పెంచి, గడువులోగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్‌రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని బల్దియా సమావేశ మందిరంలో స్మార్ట్‌సిటీ పనుల పురోగతిపై శనివారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్మార్ట్‌సిటీ ప్యాకేజీ 1, 2, 3లో చేపట్టిన స్మార్ట్ రోడ్లు, మల్టీపర్పస్ పారు, టవర్ సరిల్ ఆధునీకరణ పనులు, 24 గంటల నీటి సరఫరా, బయో మైనింగ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిగ్నలింగ్, సీసీ సర్వైవ్‌లెన్స్, డిజిటల్ లైబ్రరీ, సమీకృత మారెట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద కాలువలు, ఈ తరగతి గదులు, తదితర ప్రాజెక్ట్‌లపై మేయర్ అధికారులతో చర్చించి సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాజెక్టుల వారీగా పనులను టైమ్ లైన్ ప్రకారం పూర్తి చేయాలని ఏజెన్సీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. స్మార్ట్‌సిటీ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించి, త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పనుల్లో నిర్లక్ష్యం చేసిన సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మల్టీపర్పస్ పారు, టవర్ సరిల్ ఆధునీకరణ పనుల్లో వేగం పెంచాలని, జూన్ 2వ తేదీలోగా మల్టీపర్పస్ పారును ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ల్యాండ్ సేపింగ్, ఫౌంటేన్, సెక్యూరిటీ గార్డ్ రూం, టికెట్ కౌంటర్, తెరపాటి గార్డెన్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వరద కాలువలు పనులను వానకాలంలోగా పూర్తి చేయాలన్నారు. అంబేద్కర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 24 గంటల మంచినీటి సరఫరాకు సంబంధించి మొదట హౌసింగ్‌బోర్డుకాలనీ రిజర్వాయర్ పరిధిలో పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.
సమీకృత మారెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు పద్మనగర్‌లోని బుల్ సెమన్ సెంటర్ స్థలంలో మారెట్ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ప్రాజెక్ట్‌ను ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. గతంలో ఇచ్చిన లొకేషన్ ఆధారంగా సిగ్నలింగ్ సిస్టమ్, సీసీ సర్వైవ్‌లెన్స్ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ క్లాస్ రూంల పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈ కిష్టప్ప, మహేందర్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.