గంగాధర, మే 7: ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు పెద్దన్నలాగా నిలుస్తు న్న సీఎం కేసీఆర్ సారును మరువవద్దని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మహిళలను కోరారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామానికి చెందిన 8 మందికి కల్యాణలక్ష్మి పథకం కింద ప్రోత్సాహకం మంజూరైంది. కాగా, శనివారం ఎమ్మెల్యే నేరుగా లబ్ధిదారుల ఇండ్లకువెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు చీర, జ్యూట్ బ్యాగు అందజేశారు. జ్యూట్ బ్యాగుపై ఉన్న కేసీఆర్ బొమ్మను చూపి స్తూ కల్యాణలక్ష్మి పథకం కింద రూ. లక్షా 116 ప్రోత్సాహకం అందజేసిన సీఎం సారును మరువవద్దని కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సర్కారు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గినట్లు పే ర్కొన్నారు.
ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలుస్తున్న ఘనత తెలంగాణ ప్ర భుత్వానికే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగాధర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు రేండ్ల జమున, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, మాల చంద్రయ్య, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్, అట్ల శేఖర్‌రెడ్డి, నిమ్మనవేణి ప్రభాకర్, ఆకుల మధుసూదన్, రామిడి సురేందర్, వేముల అంజి, పెంచాల చందు, మామిడిపెల్లి అఖిల్, సముద్రాల అజయ్,మ్యాక వినోద్ పాల్గొన్నారు.
కవలలకు సర్కారు కట్నం
పేదింట కల్యాణలక్ష్మి సంబురం అంబరాన్నంటింది. కవల బిడ్డల పెండ్లిళ్లకు ఒకేసారి కల్యాణలక్ష్మి కింద రూ. 2లక్షలు మంజూరుకావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగితేలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన తొర్రికొండ విజయ-అంజయ్య కు కవల కూతుర్లు సంగీత, సౌజన్య. వ్యవసాయమే వీరి జీవనాధారం. సంగీతను బీఎస్సీ అగ్రీకల్చర్, సౌజన్యను పీజీ చదివించారు. గతే డాది జూన్ 23న ఇద్దరి బిడ్డల పెండ్లి చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవలే వీరికి కల్యాణలక్ష్మి కింద లక్షానూటాపదహారు రూపాయల చొప్పున మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చె క్కులను శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారి గ్రామానికి వెళ్లి విజయ-అంజయ్యకు అందజేశారు. చెక్కులను అందుకున్న కుటుంబం మురిసిపోయింది. బిడ్డల పెండ్లిళ్లకు మేనమామలా అండగా నిలిచిన ముఖ్యముంత్రి కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు తెలిపింది.
బొట్టు పెట్టి ఆహ్వానించినం
మా బిడ్డ సౌమ్య వివాహాన్ని గత యేడాది ఆగస్టు 11న జరిపించాం. కల్యాణలక్ష్మి పథకం కింద మా కుటుంబానికి లక్షా నూటాపదహారు రూపాయలు వచ్చాయని సర్పంచ్ మాకు చెప్పారు. ఎమ్మెల్యే సారు ఇంటి కాడికి పొయ్యి చెక్కు తెచ్చుకోవాలె అనుకుని సర్పంచ్‌ను అడిగిన. మనమెక్కడికి పోవుడు లేదు, ఎమ్మెల్యే గారే ఇంటికి వచ్చి చెక్కు ఇత్తరని చెబితే ఆశ్చర్యమేసింది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మొదట మా ఇంటికే వచ్చి కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు, చీర, బ్యాగు ఇచ్చిండు. బొట్టు పెట్టి ఇంట్లకు ఆహ్వానించినం. ఇంటికే వచ్చి చెక్కు ఇవ్వడం సంతోషంగా ఉంది. -మేడిచెల్ముల లత-మల్లయ్య
చెప్పలేని సంతోషం..
ఎమ్మెల్యే రవిశంకర్ గారు మా ఇంటికే వచ్చి కల్యాణలక్ష్మి చెక్కు ఇవ్వడం చెప్పలేని సంతోషాన్నిచ్చింది. గత యేడాది నవంబర్‌లో మా బిడ్డ శైలజ పెళ్లి చేసినం. కల్యాణలక్ష్మి చెక్కు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే అమ్మా నేను మీ అన్నను చెల్లి ఇంటికి వచ్చిన, చెల్లి ఇంటికి వచ్చిన అన్న ఉత్తగ వస్తడా అందుకే చెక్కుతో పాటు చీర తెచ్చిన అని చెప్పి, కల్యాణలక్ష్మి చెక్కు 100116 రూపాయలు, చీర ఇచ్చిండు. మాకు మస్తు సంతోషం వేసింది. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇట్ల ఇంటికి రాలేదు.
-వేనువంక కల్పన రాజయ్య