సైదాపూర్, మే 6 : సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయి. మండలంలో రెండు సింగిల్ విండోల పరిధిలో 22 కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే 42,847 క్వింటాళ్ల సేకరణ జరుగగా, అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలకేంద్రంలోని వెన్కేపల్లి-సైదాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో దుద్దనపల్లి, వెన్కేపల్లి, సైదాపూర్, జాగీర్పల్లి, రాంచంద్రాపూర్, ఎలబోతారం, రాములపల్లి, ఎల్లంపల్లి, గుజ్జులపల్లి, గొడిశాల, గుండ్లపల్లి, బొమ్మకల్, రాయికల్, వెంకటేశ్వర్లపల్లి, పెర్కపల్లి, సర్వాయిపేట, శివరాంపల్లి, రాయికల్తండాలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే వెన్నంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో వెన్నంపల్లి, సోమారం, లస్మన్నపల్లి, ఆరెపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాల్లో కేంద్రాలను నెలకొల్పారు. నిర్ణీత తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తున్నారు.
42,847 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు
రెండు సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఇప్పటి దాకా 42,847 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వెన్కేపల్లి-సైదాపూర్ సహకార సంఘం పరిధిలోని దుద్దనపల్లి సెంటర్లో 4091 క్వింటాళ్లు, వెన్కేపల్లిలో 331, సైదాపూర్‌లో 1307, జాగీర్‌పల్లిలో 839, రాంచంద్రాపూర్‌లో 1811, ఎలబోతారంలో 1989, రాములపల్లిలో 298, ఎల్లంపల్లిలో 466, గుజ్జలపల్లిలో 2068, గొడిశాలలో 473, గుండ్లపల్లిలో 669, బొమ్మకల్‌లో 727, రాయికల్‌లో 3725, రాయికల్తండాలో 593, వెంకటేశ్వర్లపల్లిలో 1718, పెర్కపల్లిలో 2440, శివరాంపల్లిలో 916, సర్వాయిపేటలో 4077 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ఇక వెన్నంపల్లి సంఘం పరిధిలోని వెన్నంపల్లి సెంటర్లో 4095 క్వింటాళ్లు, సోమారంలో 1934, లస్మన్నపల్లిలో 2032, ఎక్లాస్‌పూర్‌లో 4567, ఆరెపల్లి కేంద్రంలో 450 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలి
రైతులు తాము పండించిన ధాన్యాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలి. ప్రభుత్వం అన్నదాతల సౌకర్యం కోసం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. దళారులకు వడ్లు అమ్మి నష్టపోవద్దు.
– కొత్త తిరుపతిరెడ్డి,వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్‌విండో చైర్మన్
ప్రభుత్వ మద్దతు ధర
సర్కారు ఏర్పాటుచేసిన కేంద్రాల్లోనే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుంది. గ్రామాల్లో దళారులు మాయమాటలు చెబితే నమ్మవద్దు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి. నిర్ణీత తేమ శాతం ఉండేలా చూసుకోవాలి.
– బిళ్ల వెంకటరెడ్డి, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్