జమ్మికుంట, మే 6: రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నదని, పథకాన్ని దళిత కుటుంబాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో దళిత బంధు లబ్ధిదారులు గురుకుంట్ల సురేశ్-వాసవి(కంగన్‌హాల్), మారెపల్లి రాధ-రేణుక (లక్ష్మీప్రసన్న బట్టల షాప్), శనిగరపు ప్రవళిక(బట్టల షాపు) ఏర్పాటు చేసుకున్న యూనిట్లను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత బంధు దేశంలోనే గొప్ప పథకం అని, దళితులంతా ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం దోహదపడుతున్నదని పేర్కొన్నారు. దళితులను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. దళిత బంధు పథకాన్ని దేశమంతటా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దేశిని కోటి, వెంకటేశ్, కుమార్, రవీందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ పట్టణంలో..
దళితుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలో దళిత బంధు పథకం లబ్ధిదారులు మైస మమత-సుధాకర్ ఎలక్ట్రికల్ సేల్స్, సర్వీస్ షాపును ఏర్పాటు చేసుకోగా, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అలాగే మండలంలోని చెల్పూర్ గ్రామంలో శనిగరం రమ-రవి, శనిగరం పద్మ-అశోక్, ఆకినపల్లి హైమవతి-రాములు, దాసారపు సుజాత-సమ్మయ్య సంయుక్తంగా ఎంపిక చేసుకున్న జేసీబీని ఎంపీపీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు పథకం వర్తిస్తుందని, ఎలాంటి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, కౌన్సిలర్ తాళ్ల్లపెల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, టీఆర్ఎస్ యూత్ హుజూరాబాద్ ఇన్చార్జి తొగరు శివకృష్ణ, కాట్రపల్లి సర్పంచ్ కాసగొని నిరోష-కిరణ్, మాజీ ఎంపీటీసీ సదానందం, పాస్టర్ నమండ్ల ఉదయ్ కుమార్, నాయకులు మైస సదానందం, సంగాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కోరపల్లిలో..
మండలంలోని కోరపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లపల్లికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు పుల్లూరి రాజకుమారీమహేశ్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ హార్డ్‌వేర్ షాపును శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు బోయిని రాజ్‌కుమార్, రమారాజయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు మమత, వార్డు సభ్యులు బండారి రాజ్‌కుమార్, బెజ్జల భాగ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.