హుజూరాబాద్‌టౌన్/ జమ్మికుంట/ జమ్మికుంట రూరల్ మే 5: ఇన్నాళ్లు దగాపడ్డ దళితులను ధనికులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి అంకురార్పణ చేశారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని దళిత బంధు లబ్ధిదారులు పీ సోనియా(సహస్ర మెన్స్పార్లర్), బీ రమేశ్(ఇండియా బ్యాండ్), సైదాబాద్ గ్రామానికి చెందిన కొలుగూరి భారతి నాటు కోళ్లఫారం, చెల్పూర్‌కు చెం దిన కల్లేపెల్లి సరస్వతి ఏర్పాటు చేసుకున్న సూపర్ మారెట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దళితులకు పట్టించుకున్న నాయకుడు లేడని, తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కరే దళిత పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. బ్యాంకు గ్యారంటీ లేకుండా ఉపాధి చూపుతున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని అభివర్ణించారు. దళిత బంధు పథకం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఘనంగా సన్మానించారు. కార్యక్ర మా ల్లో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూ రి రాజ్‌కుమార్, కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, పొనగంటి సారంగం, టీఆర్ఎస్ నేతలు తుమ్మేటి సమ్మిరెడ్డి, సురేందర్‌రెడ్డి, రామస్వామి, హుజూరాబాద్ ఎంపీపీ రాణీసురేందర్రెడ్డి ఉన్నారు.