చొప్పదండి, మే 1: మండలంలో ఆదివారం హమాలీ సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద హమాలీ సంఘం, సీఐటీయూ నాయకులు కార్మిక జెండాను ఎగురవేశారు. మార్కెట్లో నిర్వహించిన వేడుకలకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశం హాజరై మాట్లాడారు. కార్మికుల హక్కులను సాధించిన చికాగో అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అలాగే, భూపాలపట్నంలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. సీఐటీయూ నాయకులు భద్రయ్య, భూమయ్య, కుమార్, శేఖర్, శ్రీనివాస్, బక్కయ్య, కనకరాజు, రమేశ్, అంజయ్య, కార్మిక సంఘం అధ్యక్షుడు మాచర్ల మీనయ్య, వైస్ ఎంపీపీ మునిగాల విజయలక్ష్మి-చందు, ఉపసర్పంచ్ కిట్టుగౌడ్, తిరుపతిరెడ్డి, సీఏలు స్వప్న, మమత, కార్మికులు పాల్గొన్నారు.
మండలంలోని మధురానగర్ చౌరస్తాలో తాపీమేస్త్రీ, సెంట్రింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘం జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బక్కశెట్టి గంగయ్య, ప్రధాన కార్యదర్శి గుంజి మల్లికార్జునరావు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని గోపాల్రావుపేట, గుండి, లక్ష్మీపూర్, రామడుగు, షానగర్, దేశరాజ్‌పల్లి, మోతె, రాంచంద్రాపూర్ గ్రామాల్లో కార్మిక దినోత్సవం ఘనంగా జరుపుకొన్నారు. గోపాల్రావుపేట పాత బస్టాండ్ కూడలిలో కార్మిక సంఘం జెండాను సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోందని దుయ్యబట్టారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో సీపీఐ మండల కార్యదర్శి ఉమ్మెంతల రవీందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గొడిశల తిరుపతిగౌడ్, నాయకులు వేముల మల్లేశం, శంకరయ్య, నాంపల్లి, ఎగుర్ల మల్లేశం, ఎలిగేటి సురేందర్, రాములు, రాజయ్య, కనకయ్య, సైండ్ల కరుణాకర్, కొత్త వెంకటేశ్, సత్యనారాయణ, భాస్కర్, పర్లపెల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
వెలిచాలలోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కర్రె రవి, రేణుక, సంతోష్, సజ్జన్ పాల్గొన్నారు.