శంకరపట్నం, ఏప్రిల్ 30: సీఎం కేసీఆర్ సంకల్పంతో ఆడబిడ్డల ఇండ్లలో కల్యాణ కాంతులు ప్రసరిస్తున్నాయని సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేశవపట్నంలో ఆదివారం ఎనిమిది మంది లబ్ధిదారుల ఇండ్లకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో బైక్‌లపై వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని కొన్ని అక్కడికక్కడే పరిష్కరించారు.
మొలంగూర్‌లో ఇఫ్తార్ విందు
మండలంలోని మొలంగూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై ముస్లింలకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం వారికి ప్రభుత్వం తరఫున కానుకలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్, వైస్ ఎంపీపీ పులికోట రమేశ్, సర్పంచుల ఫోరం చైర్మన్ పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం చైర్మన్ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ బొజ్జ కవిత, ఉప సర్పంచ్ హన్మంతు, ఏఎంసీ వైస్ చైర్మన్, చౌడమల్ల వీరస్వామి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజా పాషా, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల కుమార్, టీఆర్ఎస్ మైనార్టీ విభాగం మండలాధ్యక్షుడు అఫ్జల్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు అలీమొద్దీన్, వైస్ ప్రెసిడెంట్ అజ్జూ, వీహెచ్ ప్రెసిడెంట్ రషీద్, వైస్ ప్రెసిడెంట్ ముజ్జు, నాయకులు మున్నా, షేక్ మన్సూర్, సయ్యద్ ఆబిద్, రాజ్‌మహ్మద్, ఫక్రూ, ముజ్జు, పాషా తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలం దేవంపల్లిలో..
మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 30: మండలంలోని దేవంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కల్యాణలక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు. చీరెలను కూడా అందించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, మహిళలు ఘనస్వాగతం పలికారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ఇంటెలిజెన్స్ సీఐ జీడీ సూర్యప్రకాశ్ తండ్రి జీడివర్ధ ఎల్లయ్య ఇటీవల మృతి చెందగా అతడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రసమయి పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ మాధవరం రమ, జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, ఉప సర్పంచ్ బండారిపల్లి శ్రీనివాస్, నాయకులు మాధవరం దామోదర్‌రావు, సంజీవరావు, జీడి సదయ్య, బూమరాజు శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులున్నారు.