కథలాపూర్ : దూలూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, వినోద్ కుమార్, రమేశ్‌బాబు ఫ్లెక్సీకి ధాన్యాభిషేకం చేస్తున్న బీజేపీ నేతలుధాన్యం కొనుగోలుపై కేంద్రం మొండికేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిన తీరుపై బీజేపీ నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు, ధాన్యాభిషేకాల కార్యక్రమాల్లో రైతులు, టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాలుపంచుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూర్ కొనుగోలు కేంద్రంలోనూ శనివారం బీజేపీకి చెందిన సర్పంచ్ దయ్య లక్ష్మీనర్సయ్య, ఎంపీటీసీ నక్క లక్ష్మీ నాగరాజు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం, పాలాభిషేకం చేశారు.
కథలాపూర్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం ధా న్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంపై బీజేపీ నేతలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివా రం మండలంలోని దూలూరులో సర్పంచ్ దయ్య లక్ష్మీనర్సయ్య, ఎంపీటీసీ నక్క లక్ష్మి-నాగరాజు రైతులు, టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉ పాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చిత్రపటానికి పాలాభిషేకం, ధాన్యాభిషేకం చేశారు. అంతకుముందు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్రావు, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, ఐకేపీ ఏపీఎం నరహరి తదితరులు పాల్గొన్నారు.