కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ);పల్లెపల్లెనా గులాబీ జెండా ఎగిరింది. టీఆర్ఎస్ 21ఏండ్ల పండుగ బుధవారం అంబరాన్నంటింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన ప్లీనరీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు, ముఖ్య ప్రజాప్రతినిధులు హాజరు కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు జెండాలను ఆవిష్కరించారు. ఊరూరా వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్ 21 ఏండ్ల ప్రస్థానాన్ని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని, రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నదని కొనియాడారు.
టీఆర్ఎస్ 21 ఏండ్ల ఆవిర్భావ వేడుక అంబరాన్నంటింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్లీనరీకి జిల్లా అగ్రశ్రేణి నాయకులు తరలివెళ్లగా, జిల్లాలో ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తోపాటు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మాజీ రీజినల్ డైరెక్టర్ మూల విజయారెడ్డి, మేయర్ బంగి అనిల్‌కుమార్, మున్సిపల్ చైర్మన్లు తరలివెళ్లారు. కాగా, జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్, ఏప్రిల్ 27: మండల కేంద్రంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పిట్టల మధు గులాబీ జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నియోజక వర్గ కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, నాయకులు ఉండింటి శ్యాంసన్, బొల్లం వెంకటస్వామి, తడకపెల్లి నారాయణ, నెల్లి మురళి, దండు రాములు, బిల్లవేని రమేశ్, నెల్లి శంకర్, రామగిరి ఆంజనేయులు, గడ్డం సంపత్, కోండ్ర వెంకటస్వామి, ఇస్కుల్ల అంజయ్య, కొమ్ము రవి, హన్మాండ్ల కుమార్, గంజి శ్రీనివాస్, ఆరెపల్లి కిరణ్, సందీప్, బొల్లం అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 27: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సదాశివపల్లితో పాటు మానకొండూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నాయి. సదాశివపల్లిలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కముటం సంపత్, కొండపల్కలలో బొల్లం శ్రీనివాస్, ముంజంపల్లిలో సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు నందగిరి మల్లయ్యాచారి, పోచంపల్లిలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోపు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేసి, స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు నామాల శ్రీనివాస్, రామిడి చుక్కయ్య, భాస్కర్ రెడ్డి, భాస్కర్, శ్రీనివాస్, రాజశేఖర్, షేక్మీరా, వెంకటేశ్, అంజిరెడ్డి, కడారి ప్రభాకర్, బొంగోని రేణుక, కైరి రజిత, అడప శ్రీనివాస్, నల్లగొండ తిరుపతి గౌడ్, గొస్కుల స్వామి, బ్రహ్మం, నరహరి గణపతి రెడ్డి, దాసరి శ్రీనివాస్, రమేశ్, హకీం, సంపత్, రవీందర్ రెడ్డి, కాసం బ్రహ్మారెడ్డి, ఉమ్మెంతల సంజీవ్, కొత్త వెంకట రెడ్డి, ఎల్పుగొండ లింగయ్య, గాజర్ల మల్లారెడ్డి, ఎల్పుగొండ మొగిలి పాల్గొన్నారు.
శంకరపట్నం మండలంలో..
శంకరపట్నం, ఏప్రిల్ 27: మండలంలోని కొత్తగట్టులో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఉమ్మెంతల రాజిరెడ్డి గులాబీ జెండా ఆవిష్కరించగా, ఎంపీపీ ఉమ్మెంతల సరోజన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, కార్యకర్తలు, ప్రజల ఆదరాభిమానాలతో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మొకిరాల కిషన్‌రావు, ఆలయ చైర్మన్ తూముల శ్యాంరావు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ తీగల రమేశ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలో..
చిగురుమామిడి, ఏప్రిల్ 27: మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ గ్రామాధ్యక్షులు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి గులాబీ జెండాను ఆవిష్కరించారు. చిగురుమామిడిలో బుర్ర శ్రీనివాస్, రేకొండలో బిల్ల వెంకట రెడ్డి, రామంచలో గీట్ల తిరుపతిరెడ్డి, ముదిమాణిక్యంలో బోయిని రమేశ్, కొండాపూర్‌లో తోడేటి శ్రీనివాస్, గాగిరెడ్డిపల్లెలో కాల్వల సంపత్ రెడ్డి, ఇందుర్తిలో ఎస్కే షిరాజ్, సుందరగిరిలో కొమ్ము సమ్మయ్య, సీతారాంపూర్‌లో శ్యామకూర సంపత్ రెడ్డి, బొమ్మనపల్లిలో కత్తుల రమేశ్, లంబాడిపల్లిలో చందబోయిన ఎల్లయ్య, ఓగులాపూర్‌లో ఎండ్ర నారాయణ, ఉల్లంపల్లిలో రావుల వెంకటయ్య, గునుకులపల్లిలో సన్నీళ్ల మల్లేశ్, ములనూర్లో బుర్ర తిరుపతి, నవాబ్‌పేట్‌లో పిల్లి వేణు, పీచుపల్లిలో యాళ్ల జనార్దన్‌రెడ్డి టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో సింగిల్‌విండో చైర్మన్ జంగా వెంకటరమణా రెడ్డి వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, టీఆర్ఎస్ మహిళా విభాగంగా మండలాధ్యక్షురాలు అందే సుజాత, నాయకులు, ఆర్బీఎస్ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గన్నేరువరం మండలంలో..
గన్నేరువరం, ఏప్రిల్ 27: మండలంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు గులాబీ జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు. గన్నేరువరం యువసేవ కార్యాలయంలో టీఆర్ఎస్ యువజన విభాగం మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. గునుకుల కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు పాల్గొనగా, చీమలకుంటపల్లి గ్రామంలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు కుసుంబ నవీన హాజరయ్యారు.