రామడుగు, ఏప్రిల్ 8: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి, మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ కలిగేటి కవిత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్వసభ్య సమావేశానికి సంబంధిత మండల, జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. జనరల్‌బాడీ సమావేశానికి హాజరై గత మూడు మాసాలుగా మీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై సభ్యులకు, మండల ప్రజలకు తెలియజేసే బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అధికారులు సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు కావడంపై సభ్యులు నిరసన తెలిపారు.
కాగా, ప్రభుత్వం అన్ని ఎంపీటీసీల పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నా, తమకు కేటాయించడం లేదని ప్రతిపక్ష పార్టీల ఎంపీటీసీలు పోడియం ముందు కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం పలు శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సమావేశంలో తహసీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్, ఎంపీటీసీలు వంచ మహేందర్‌రెడ్డి, గుర్రం దేవిక, కనుకం జయ, ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, కరుణశ్రీ, తొరికొండ అనిల్, కొత్త పద్మ, జవ్వాజి హరీశ్, మోడి రవీందర్, సర్పంచులు ఉమ్మెంతల అభిషేక్‌రెడ్డి, బండ అజయ్‌రెడ్డి, జవ్వాజి శేఖర్, దర్శన్రావు, ఏవో యాస్మిన్, సీడీపీవో కస్తూరి, పీఆర్ ఏఈ సచిన్, మిషన్ భగీరథ డీఈ ప్రభాకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద, వైద్యాధికారులు శ్రీనివాస్, రాజేందర్, పశువైద్యాధికారి అనిల్, ఏపీవో రాధ, ఏపీఎం ప్రభాకర్ పాల్గొన్నారు.