గంగాధర, ఏప్రిల్ 7: రైతులను గోస పెట్టకుండా యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షకు మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, రైతులు ర్యాలీగా తరలివెళ్లారు. కాగా, మధురానగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నవీన్‌రావు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని కేంద్రం హామీ ఇచ్చే వరకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గంగాధర సింగిల్ విండో చైర్మన్ బాలాగౌడ్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
చొప్పదండి, ఏప్రిల్ 7: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు తరలివెళ్లారు. ఈసందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేసే వరకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
రామడుగు, ఏప్రిల్ 7: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, వడ్లు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, వెదిర గ్రామ కో-ఆర్డినేటర్ దొడ్డ లచ్చిరెడ్డి, పూడూరి మల్లేశం, సాతర్ల వివేకానంద, తౌటు మురళి, లంక మల్లేశం, కొడిమ్యాల రాజేశం, చిమ్మల్ల శ్రీనివాస్, మామిడి తిరుపతి, ఆరపెల్లి ప్రశాంత్, ఎడవెల్లి మల్లేశం, బీ సురేశ్, రుద్రాక్ష హరీశ్, కటుకం హరీశ్ తదితరులు ఉన్నారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 7: కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షకు కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి టీఆర్ఎస్ నాయకులు, రైతులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా తరలివెళ్లారు. ఇక్కడ దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గాండ్ల కొమురయ్య, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎల్కపల్లి చంద్రమోహన్, రైతులు ఉన్నారు.