హుజూరాబాద్, ఏప్రిల్ 5: వరికి గడ్డు కాలం రావడంతో రైతులు సరికొత్తగా ముందుకు సాగుతున్నారు. విభిన్న రకాలు వేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇప్పటికే యాసంగిలో ఇతర పం టల ఆడ మగ (మేల్ ఫిమేల్)వరి, మక్క వేస్తుండగా, ఓ రైతు మాత్రం విభిన్న పద్ధతిని అనుసరించాడు. మన వద్ద వానకాలంలో పత్తి సాగు వేస్తుండగా, ఈ కర్షకుడు మాత్రం గతంలో ఎవరూ పాటించని.. మనం ఎన్నడూ చూడని వి ధంగా యాసంగిలో పత్తిపెట్టాడు. వరి కోత పూర్తయిన వెంటనే అదే మడికట్టులో సాగుకు శ్రీకారం చుట్టి సక్సెస్ అయ్యాడు.
నవంబర్ రెండో వారంలో సాగు
బీటీ టెక్నాలజీ రాక ముందు పత్తి తొమ్మిది నెలల పంటగా ఉండేది. చిదురు ముదురు వానలకు అనగా జూన్లో విత్తడం మొదలుపెడితే జూ లై 20వ లోపు ముగిసేది. ఏప్రిల్ వరకు పంట ఉండగా, రెండు పసళ్లు ఒకే పంట కొనసాగేది. ఇక బీటీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒకే పసలు అనగా ఐదునెలల పదిహేను రోజుల నుంచి ఆరు నెలలు మాత్రమే పంట ఉంటుంది. ఇది కొన్నేం డ్ల నుంచి కొనసాగుతున్న విధానం. పత్తి పంట కాలం పూర్తయ్యాక నీటి వసతి ఉంటే మరో పం ట సాగు చేయడం పరిపాటిగా మారింది. అయితే వానకాలం వరికి ఢోకా లేకపోవడం, యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాల్సిన ఆవశ్యకత రావడంతో రైతు మల్లారెడ్డి వినూత్నంగా ఎవరూ యాసంగిలో పత్తి సాగు చేశాడు. నవంబరు 15న రైతు విత్తనాలు వేయగా ప్రస్తుతం పత్తి ఏరే దశకు పంట చేరుకుంది. వానకాలం వరి కోత పూర్తయిన వెంటనే అనగా అక్టోబర్ 15 నుంచి విత్తడం మొదలు పెట్టి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తనాలు విత్తుకోవచ్చని, మే ఆఖరి వరకు పంట పూర్తవుతుందని చెబుతున్నాడు.
ప్రయోగాత్మకంగా ఎకరంలో సాగు
మల్లారెడ్డి తనకున్న వ్యవసాయభూమిలో ప్ర యోగాత్మకంగా ఎకరంలో పత్తి సాగు చేశాడు. వరి కోత పూర్తయిన తర్వాత మడిని రోటవేటర్తో చదును చేసి రెండ్రోజులు ఎండ బెట్టాడు. వరుసగా మొలకలు ఉండేందుకు సన్నపు తాడు తో లేదా రెండు ఫీట్లవెడల్పుతో అచ్చుకట్టి విత్తనాలు పెట్టాడు. పోగుంటలతో కలుపుకొని నాలు గు విత్తన ప్యాకెట్లు సరిపోతాయని సూచిస్తున్నా డు. విత్తనాలు మొలకెత్తడానికి రెయిన్ డ్రిప్, స్ప్రింక్లర్లలో ఏదైనా వాడవచ్చు. ఆ తర్వాత నీళ్లు కడితే సరిపోతుంది. మల్లారెడ్డి ప్రయోగాత్మకంగా చేపట్టిన పత్తి సాగు సత్ఫలితాలు ఇవ్వడంతో వచ్చే యేడు యాసంగి పత్తి సాగు పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
6నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది..
వరి పంట సాగుకు కూలీల కొరత ఎక్కువగా ఉంది. పెట్టుబడి పోను పెద్దగా ఏమీ మిగలడం లేదు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాలు ఉండే అవకాశాలు లేకపోవడంతో యాసంగిలో ధాన్యానికి ధర తక్కువగా ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్రమంలో యాసంగిలో పత్తి సాగు విధానం యూ ట్యూబ్లో చూడడమే కాకుండా వ్యవసాయాధికారుల సలహాలు తీసుకున్నా. పెట్టుబడి కూడా తక్కువగానే అవుతుంది. ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న పత్తి మంచి దిగుబడి వస్తే ప్రతి రైతుకు ఎంతో ఉపయయోగకరంగా ఉంటుంది. చేను చూస్తుంటే 6నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
– గూడూరి మల్లారెడ్డి, రైతు
ఆంధ్రాలో కొన్ని చోట్ల నవంబర్లో వేస్తరు..
మన రాష్ట్రంలో ఈశాన్య రుతుపనాల ఆధారంగా జూన్ ఆరంభంలో పంటలు సాగు చేస్తుంటారు. ఆంధ్రలో నైరుతి రుతుపవనాలు అక్టోబర్ చివరలో ప్రారంభమవుతాయి. దీంతో పత్తి సాగు చేసే రైతులు నవంబర్లో విత్తుతారు. ఇదీ ఎక్కువగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉంటుంది. మన దగ్గర యాసంగి పత్తి సాగు చేసే రైతులు రెండో పంటగా అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ మొదటి వరకు విత్తవచ్చు. ఎందుకంటే ముందుగా సాగు చేసిన వరి అక్టోబర్లో కోతకు వస్తుంది. చీడపీడలు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పత్తి పంటను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతుకు వివరించాం.
– దోమ ఆదిరెడ్డి, ఏడీఏ