కరీంనగర్ రూరల్, మార్చి 18: కరీంనగర్ రూరల్ మండలంలో శుక్రవారం హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. గోపాల్‌పూర్‌లో వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఊరడి మల్లారెడ్డి, ఆరె శ్రీకాంత్, మంద రాజమల్లు, దుర్శేడ్‌లో సుంకిశాల సంపత్‌రావు, నందల తిరుపతి, వేముల అశోక్, రామచంద్రం, వేణుమాధవరావు, బుర్ర రమేశ్, తోట తిరుపతి, నేరెళ్ల శ్రీనివాస్, రామోజు తిరుపతి, చేగుర్తి, చామనపల్లి రాజయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆనందరావు, చంద్రమోహన్, గాండ్ల కొమురయ్య, గాండ్ల అంజయ్య, మల్లేశం యాదవ్, సంపత్‌యాదవ్, మొగ్దుంపూర్లో నర్సయ్య, అంజిరెడ్డి, తిరుపతి, తాళ్లపల్లి శ్రీనివాస్, తొగరు మల్లారెడ్డి, దాడి లచ్చయ్య, రాజిరెడ్డి, చామనపల్లిలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బోగొండ ఐలయ్య, ప్రభాకర్, బుర్ర గంగయ్య, గర్వంధ శ్రీనివాస్, వడ్ల కొండ రవీందర్, ఇరుకుల్ల, సంపత్, ప్రసాద్, శ్రీనివాస్, చెర్లభూత్కూర్‌లో రమణారెడ్డి, నల్ల శ్రీనివాస్ రెడ్డి, మాసగోని రమేశ్‌గౌడ్, చిట్కూరి శేఖర్, కూర శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నాగభూషణం, ఆంజనేయులు, రంగారెడ్డి, బొమ్మకల్‌లో జడ్పీటీసీ పురుమల్ల లలిత, సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, గూడ తిరుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి, నరోత్తం రెడ్డి, తోట కిరణ్, రాజేందర్, సత్యనారాయణ, మద్దెల శ్రీనివాస్, జక్కినపల్లి శంకర్, ఆంజనేయులు, యుగేంధర్, బీరం ఆంజనేయులు, కల్వల మల్లేశం, కల్వ అశోక్, గోష్కి శంకర్, ర్యాకం మోహన్, అశోక్, ఎలబోతారంలో బుచ్చాల కొమురయ్య, చల్ల లింగారెడ్డి, అశోక్, జూబ్లీనగర్ కుమార్, సంతోష్, రమేశ్, మునిరెడ్డి, రాజేశం, రాజు, వెంకటేశ్వర్లు, సంపత్ పాల్గొన్నారు. నగునూర్‌లో ఎంపీటీసీలు వినయ్‌సాగర్, శ్రీనివాస్, సర్పంచ్ ఉప్పు శ్రీధర్, ఉపసర్పంచ్ దామోదర్‌రెడ్డి, కస్తూరి అశోక్, రాంరెడ్డి, మధుకర్, వరి శంకర్, బొనగిరి హన్మంత్, శ్రీనివాస్ రెడ్డి, మహిళలు, యువకులు రంగులు చల్లుకుంటూ సంబురాలు చేసుకున్నారు. నగునూర్‌లో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఒకరికొకరు రంగులు పూసుకుని ఉత్సాహంగా గడిపారు. కరీంనగర్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ను వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జూవ్వాడి రాజేశ్వర్‌రావు, దుర్శేడ్ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, ఇరుకుల్ల ఉపసర్పంచ్ ముత్యం శంకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
చొప్పదండి, మార్చి 18: మండలంలో శుక్రవారం హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. యువకులు ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకలో యువకులు, నాయకులు పాల్గొన్నారు.
గంగాధర, మార్చి 18 : మండలంలోని వివిధ గ్రామాల్లో హోలీ వేడుకలను ప్రజలు సంతోషంగా నిర్వహించుకున్నారు. రంగులు చల్లుకుని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
రామడుగు, మార్చి 18 : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావును కరీంనగర్‌లోని తన నివాసంలో కలిసిన టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రామడుగు మండల ప్రజలకు వీర్ల వెంకటేశ్వరరావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
కార్పొరేషన్, మార్చి 18: నగరంలోని 33వ డివిజన్ భగత్‌నగర్ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద మేయర్ సునీల్‌రావు, ఆయన సతీమణి అపర్ణారావు రంగులు చల్లుకున్నారు. కాలనీకి చెందిన మహిళలు, పురుషులు, యువతీ యువకులు, చిన్నారులు సైతం రంగులు పూసుకుంటూ మేయర్‌తో కలిసి డీజే పాటలకు స్టెప్పులేశారు.
కొత్తపల్లి, మార్చి 18 : కొత్తపల్లితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రంగుల సంబురాలు జోష్‌గా సాగాయి. మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌గౌడ్‌కు ప్రజాప్రతినిధులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యానగర్, మార్చి 18: 19వ డివిజన్లోని రేకుర్తిలో కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విద్యానగర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి, ప్రశాంత్ పాల్గొన్నారు.