వీణవంక, ఫిబ్రవరి 28: దళితబంధు దేశానికే గర్వకారణమని, రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది సీఎం కేసీఆర్ అని, యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఈదునూరి రాజయ్య దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన లక్ష్మీ శానిటరీ అండ్ ఎలక్ట్రానిక్స్ షాప్‌ను సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదిగి ఆదర్శంగా నిలువాలని సూచించారు. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు యూనిట్ వస్తుందని, అధికారులు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి గ్రౌండింగ్ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల సాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, సింగిల్‌విండో డైరెక్టర్ ముదుగంటి శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ తాండ్ర శంకర్, నాయకులు పుప్పాల రాములు, గోపాల్‌గౌడ్, జక్కు నారాయణ, తప్పెట రమేశ్, కొయ్యడ మొగిలి, దూడం సదానందం, దాసారపు శ్యామ్, స్టీఫెన్, జీవన్‌కుమార్, మల్లేశం పాల్గొన్నారు.
దళితబంధు అద్భుతమైన పథకం
దేశంలోనే దళిత బంధు పథకం అద్భుతమైనదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నియోజవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామానికి చెందిన పద్మాభిక్షపతి, కిషన్, తిరుపతి దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసుకున్న సిమెంట్, ఐరన్ షాపు, డీసీఎం వ్యాన్‌ను ప్రారంభించి మాట్లాడారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, సర్పంచ్ కొడుగూటి శారద, ఎంపీటీసీ గద్దల లలిత ఉన్నారు.
యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం దళిత యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. శిక్షణ కోసం రూ.50కోట్లు కేటాయించారని తెలిపారు. జమ్మికుంటలో సోమవారం బీసీఐటీ నిర్వాహకుడు లెంకలపెల్లి శరత్‌కుమార్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్, ఎంఎస్ ఆఫీస్, డీసీఏ, ట్యాలీ, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఉచిత శిక్షణ కోర్సులును ఏర్పాటు చేయగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు ప్రారంభించారు. శిక్షణ పొందిన యువతకు ప్లేస్మెంట్, మహిళలకు ఉచితంగా కుట్ట మిషన్లు పంపిణీ చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, బీసీఐటీ నిర్వాహకుడు లెంకలపెల్లి శరత్‌కుమార్ పేర్కొన్నారు. తర్వాత శిక్షణ పొందుతున్న యువతను కలిశారు. ఇక్కడ జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్‌కుమార్, నాయకులు లింగారావు, రమేశ్, దిలీప్, శ్రీనివాస్, శ్రీరామ్, రాజారెడ్డి, తదితరులున్నారు.