చిగురుమామిడి, ఫిబ్రవరి 10: మండలంలో రోడ్ల నిర్మాణానికి రూ. 39 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గురువారం పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ కొత్త వినీత, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మండలంలో రోడ్లు అధ్వానంగా ఉండేవని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ అందె సుజాత, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, వెంకటేశం, సుద్దాల ప్రవీణ్, పెద్దపెల్లి భవాని, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, నాయకులు పెసరి రాజేశం, కల్వల రాజేశ్వర్ రెడ్డి, బోయిని మనోజ్‌కుమార్, అందె పోచయ్య, అందె పరశురాములు, బుర్ర తిరుపతి, తోడేటి శ్రీనివాస్, కల్వల సంపత్ రెడ్డి, అన్నాడి మల్లికార్జున్‌రెడ్డి, కొమురయ్య, మారెళ్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.