సారంగాపూర్, ఫిబ్రవరి 10: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతితో గ్రామాలాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఒడ్డెర కాలనీ గ్రామంలో పల్లె ప్రగతిలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో భీరయ్య ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైకుంఠధామం, డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. గ్రామాలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తుండడంతో అన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, పార్టీ మండలాధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తోడేటి శేఖర్ గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పల్లపు వెంకటేశ్, మాలెపు విమల, బెక్కెం జమున, పల్లికొండ రమేశ్, వెంకట రమణారావు, ఢిల్లీ రామారావు, జోగిన్‌పెల్లి సుధాకర్‌రావు, భూక్యా సంతోష్, సింగిల్ విండో చైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ బాపిరాజు, ఉప సర్పంచ్ మాధవి, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు దూలూరి వంశీ, నాయకులు శ్రీనివాస్, సుధాకర్, చిన్నారెడ్డి, దామోదర్‌రావు, రవీందర్రావు, ప్రేమానందం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.