తెలంగాణచౌక్, ఫిబ్రవరి 7: మేడారం జాతరకు ఈనెల 13 నుంచి 19 వరకు కరీంనగర్ రీజియన్ నుంచి 530 స్పెషల్ బస్సులు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. కరీంనగర్ కేంద్రం నుంచి 115, పెద్దపల్లి నుంచి 125, మంథని నుంచి 115, గోదావరిఖని నుంచి 115, యైటింక్లయిన్ కాలనీ నుంచి 30, హుజూరాబాద్ నుంచి 45 బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయడంలేదని చెప్పారు. సోమవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డీవీఎం రవిశంకర్‌రెడ్డి, కరీంనగర్ డిపో-1 మేనేజర్ అర్పితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆరు పాయింట్లలో భక్తులకు సకల సౌకర్యా లు కల్పించామన్నారు. తాగునీరు, టెంట్, టాయిలెట్స్లాంటి వసతులు సమకూర్చామన్నారు. జాతరకు వెళ్లేవారికి శానిటైజేషన్ చేయడంతో పాటు అనుమానితులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు. కరోనా నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లకు బూస్టర్ డోస్ ఇప్పించామని వెల్లడించారు. ప్రయాణికులకు రూ. 5కే మాస్క్‌లు అందజేస్తామని చెప్పా రు. భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను వినియోగించుకొని సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పర్యవేక్షలు వీరే..
కరీంనగర్ నుంచి వెళ్లే బస్సులను కరీంనగర్ డిపో-1 మేనేజర్, సెల్-9959225920, పెద్దపల్లి నుంచి వెళ్లే బస్సులను జగిత్యాల డీఎం సెల్-9959225925, మంథని నుంచి వెళ్లే బస్సులను మంథని డీఎం సెల్- 9959225923, గోదావరిఖని నుంచి వెళ్లే బస్సులను గోదావరిఖని డీఎం సెల్- 9959225922, యైటింక్లయిన్‌కాలనీ నుంచి వెళ్లే బస్సులను సిరిసిల్ల డీఎం సెల్ 995922 5929, హుజూరాబాద్ నుంచి వెళ్లే బస్సులను హుజూరాబాద్ డీఎం సెల్ – 9959225924 పర్యవేక్షిస్తారు.