చిగురుమామిడి, ఫిబ్రవరి 7: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని నవాబ్‌పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతలకు ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ జ్ఞాపికలు, ట్రోఫీని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదన్నారు. క్రీడల్లో నైపుణ్యం పెంపొందించేందుకు గ్రామీణ క్రీడలు, టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. విజేతలు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం ..
టీఆర్ఎస్ కోసం అంకితభావంతో పనిచేసి అకాల మరణం చెందిన కుటుంబాలను పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. బొమ్మనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన దుర్గాని మహేందర్, బొంకూరి మొండయ్య, తాటిపల్లి రమ, కానవేని రాజయ్య కుటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు సుద్దాల ప్రవీణ్, జకుల రవి, బెజ్జంకి లక్ష్మణ్, కానుగంటి భూమిరెడ్డి, ఎంపీటీసీలు మిట్టపల్లి మల్లేశం, మంకు స్వప్న, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల రమేశ్, ఉప సర్పంచ్ పెండ్యాల శారద, స్థానిక నాయకులు మంకు శ్రీనివాస్‌రెడ్డి, సాంబారి కొమురయ్య, సర్వర్ పాషా, కూతురు చరబండారెడ్డి, అనుమాండ్ల సత్యనారాయణ, కొంకట వెంకటస్వామి, తాడ శ్రీనివాస్‌రెడ్డి, దేశిని రాజయ్య, తోట శ్రీనివాస్, పెండ్యాల సదానందం, కాసర్ల హరీశ్, ముత్యాల కొమురయ్య, నిర్వాహకులు తదితరులు ఉన్నారు.