తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్15: మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో గు రువారం నుంచి మూడు రోజుల పాటూ జరిగే ‘జాతీయస్థాయి టెక్నికల్ ఫెస్ట్-ఎలక్ట్రోవైట్స్’ ప్రారంభమైంది. కార్యక్రమాన్ని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. టెక్నికల్, సాఫ్ట్వేర్, హార్ట్‌వేర్ ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించి అధ్యాపకులు, తోటి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ కంపెనీ ప్రతినిధి వినోద్‌కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈవీఎం, శాటిలైట్, ఆంటెనా మొదలైన పరికరాలతో పాటూ విమా నయాన రంగానికి సంబంధించిన పరికరాలు తయారు చేస్తూ దేశ సంపద పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నామని చెప్పారు. ఈసీఈ విద్యార్థుల విజ్ఞానం దేశ సంపద పెంపునకు దోహదపడుతుందన్నారు.
విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికే ఇలాంటి జాతీయ టెక్నికల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు.ఎలక్ట్రానిక్, టీవీలు, టెలిఫోన్ రంగానికి సంబంధించిన పరికరాలు తయా రు చేయడంలో ఈ విభాగానికి ప్రముఖ పాత్ర ఉంటుంద న్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్‌లను వీక్షించారు. కార్యక్రమంలో డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రసాదరాజు, ఈసీఈ హెచ్ఓడీ డాక్టర్ నరేశ్‌కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ డాక్టర్ రవికుమార్, సర్దార్ గురుదాస్సింగ్, ఏ సంతోష్కుమా ర్, ఏవో రామారావు, లైబ్రెరీయన్ గొంటి రమేశ్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.