Theft | చిగురుమామిడి, అక్టోబర్ 23 : చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలోని పెద్దమ్మ గుడిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. పెద్దమ్మ గుడి లోని అమ్మవారి బంగారపు ముక్కుపుడక పుస్తెలు హుండీలో ఉన్న దాదాపు రూ.4వేల నగదు తీసుకెళ్లారు.
ఆలయ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్ వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లారు. ఆలయంలోని దొంగతనంపై ముదిరాజ్ సంఘం నాయకులు మాజీ సర్పంచ్ జక్కుల రవి, జక్కుల రాములు, జక్కుల స్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దొంగతనం జరిగిన ఆలయాన్ని పరిశీలించారు.